కృత్రిమ మేథతో ఐవీఎఫ్‌ సక్సెస్‌

6-7-2017: సంతానంకోసం ఐవీఎఫ్‌ విధానానికి సిద్ధమయ్యే దంపతులకోసం శాస్త్రవేత్తలు కృత్రిమ మేథో వ్యవస్థను రూపొందించారు. ఐవీఎఫ్‌ విధానంలో అండాన్ని శుక్ర కణంతో కలిపి, ఫలదీకరణం చెందాక ఏర్పడిన పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ మొత్తం లేబరేటరీలో జరుగుతుంది. ఉన్న పిండాలలో ఆరోగ్యంగా ఎదిగే పిండాన్ని ఎంపికచేసి మహిళల గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియలో మరింత కచ్చితత్వం తీసుకురావడానికి తాజా వ్యవస్థ ఉపయోగపడుతుందని నిపుణులు వెల్లడించారు.