హార్మోన్‌ సమస్యలకు పరిష్కారం

ఆంధ్రజ్యోతి,30-3-2017: ప్రస్తుత కాలంలో చాలామంది థైరాయిడ్‌, పీసీఓడీ , సంతానలేమి, డయాబెటిక్‌ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి అసమతుల్యతలు తలెత్తడానికి చిన్న కారణం చాలు. ఇవి తీవ్రమై దీర్ఘకాలిక వ్యాధులుగా పరిణమిస్తాయి. కాబట్టి ఆయా కారణాల పట్ల అవగాహన పెంచుకోవడం వలన హార్మోన్‌ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. హార్మోన్లు అనేవి శరీరంలోని ఎండోక్రైన్‌ గ్రంథుల నుంచి ఉత్పత్తి అయ్యే రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంతపు కణజాలం అవయవాల నుంచి ఉత్పత్తి అయి.. రక్తప్రసరణ ద్వారా వివిధ శరీర భాగాలకు చేరుకుని జీవక్రియల సమతుల్యతకు తోడ్పడతాయి. ఇవి శరీరంలో సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ, శారీరక, మానసిక ఎదుగుదల ప్రక్రియలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ వంటి జీవక్రియలపై వీటి ప్రభావం ఉంటుంది. ఏ కారణం వల్లనైనా ఈ హార్మోన్లు అసమతుల్యతకు గురైతే అది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

వివిధ హార్మోన్లు.. వాటి అసమతుల్యత వల్ల కలిగే వ్యాధులు 
థైరాయిడ్‌ హార్మోన్లు (టీ3, టీ4): థైరాయిడ్‌ గ్రంథి ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ హార్మోన్ల ప్రభావం 90 శాతం మేర మానవ జీవకియ్రలపై ఉంటుంది. వీటి అసమతుల్యత వల్ల హైపోథైరాయిడ్‌, హైపర్‌ థైరాయిడ్‌, గాయిటర్‌ వంటి జబ్బులు కలుగుతాయి.
 
హోమియోకేర్‌ చికిత్స: ప్రస్తుత పరిస్థితుల్లో మానవుడి ప్రకృతి విరుద్ధమైన జీవన విధానం, అధిక ఒత్తిడికి గురవ్వడం, వ్యాయామ లోపం వంటివి థైరాయిడ్‌ సమస్యలకు కారణం అవుతున్నాయి. థైరాయిడ్‌ సమస్యలకు జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా.. వీటికి గల మూలకారణాన్ని గుర్తించి, రోగి శారీరక, మానసిక తత్వానికి అనుగుణంగా హోమియో వైద్యం అందించి థైరాయిడ్‌ హార్మోన్‌ సమన్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
 

స్త్రీలలో హార్మోన్లు: ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌, ప్రొలాక్టిన్‌, ఆక్సిటోసిన్‌ హార్మోన్లు సీ్త్రలలో రజస్వల, రుతు చక్రం, ద్వితీయ లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల రుతుచక్ర మస్యలు, అవాంఛిత రోమాలు, సంతాన లేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. 

పురుషులలో ఉండే హార్మోన్లు: టీఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్లు పురుషులలో శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ అసమతుల్యత వల్ల శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణాల సమస్యలు తలెత్తుతాయి.
 
హోమియోకేర్‌ చికిత్స: హోర్మోన్‌ సమస్యలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. హోమియోకేర్‌ వైద్యప్రక్రియలో భాగంగా ఎలాంటి హార్మోన్‌లను బయట నుంచి ఇచ్చే అవసరం లేకుండా.. హార్మోన్ల అసమతుల్యతను సరిచేయవచ్చు.
 

డయాబెటిస్‌: ఏడీహెచ్‌ (యాంటీ డైయూరెటిక్‌ హార్మోన్‌) లోపం వల్ల తలెత్తే ఈ సమస్యను అతి మూత్ర వ్యాధి అని కూడా అంటారు. డయాబెటిస్‌ మెల్లిటస్‌.. ఇది క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సూలిన్‌ లోపం వలన కలుగుతుంది. డయాబెటిస్‌- టైప్‌ 1.. ఇది ఇన్సూలిన్‌ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఏర్పడుతుంది. దీనిని జువెనైల్‌ డయాబెటిస్‌ అంటారు. ఈ వ్యాధిగ్రస్తులు పూర్తిగా ఇన్సూలిన్‌ ఇంజెక్షన్లపై ఆధారపడాల్సి వస్తుంది. టైప్‌ 2 డయాబెటిస్‌.. ఇది ఇన్సూలిన్‌ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఎక్కువగా 30 ఏళ్లు పైబడిన వారిలో వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిస్‌ బాధితులు వ్యాధిని నియంత్రించలేకపోతే దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలకు గురికావాల్సి రావొచ్చు. 

హోమియేకేర్‌ చికిత్స: డయాబెటిస్‌ తొలిదశలోనే గుర్తించి, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ వారి ప్రత్యేక హార్మోన్‌ సెల్‌ మరియు కాన్స్‌టిట్యూషనల్‌ విధానం ద్వారా డయాబెటిస్‌ బాధితులలో... దీర్ఘకాలం పాటు ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని అదుపులో ఉంచడంతో పాటు అన్ని డయాబెటిస్‌ కాంప్లికేషన్స్‌ నివారించవచ్చు. ఇతర హార్మోన్‌ సమస్యలను కూడా సంపూర్ణంగా నయం చేయవచ్చు. 

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ ఇకఈ 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ 
టోల్‌ ఫ్రీ : 1800 108 1212 
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, 
తమిళనాడు, పాండిచ్చేరి