స్తంభన సమస్యకు కారణాలివే!

11-12-2017: హఠాత్తుగా అంగ స్తంభన సమస్య తలెత్తితే అందుకు కారణాలను అన్వేషించాలి. వయసు పైబడిందనో, ఓపిక తగ్గిందనో నిట్టూర్చి ఊరుకోకుండా పరోక్షంగా అంగ స్తంభన సమస్యకు కారణమయ్యే అంతర్గత వ్యాధులు, సమస్యల కోసం వెతకాలి. స్తంభన సమస్యకు ప్రధాన కారణాలు ఇవే!

 
వ్యాధులు, ప్రమాదాలు: హృద్రోగ సంబంధ వ్యాధులు, ఎరిథ్రోస్ల్కిరోసిస్‌, మూత్రపిండ సమస్యలు, మల్టిపుల్‌ స్ల్కిరోసిస్‌, వెన్ను, మెదడు గాయాలు.
 
జీవనశైలి: ధూమపానం, మద్యపానం, డ్రగ్స్‌ తీసుకోవటం, అధిక బరువు, శారీరక వ్యాయామం పూర్తిగా లోపించటం.
 
మందులు: రక్తపోటు, ఇతర మానసిక సమస్యలకు వాడే మందులు, మత్తు మందులు.

మానసిక కారణాలు: ఒత్తిడి, డిప్రెషన్‌, ఆత్మవిశ్వాస లోపం, పర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ.

సర్జరీలు, చికిత్సలు: ప్రోస్టేట్‌, మూత్రాశయం క్యాన్సర్ల చికిత్స, అధిక రక్తపోటు వల్ల అంగంలోని నరాలు, రక్తనాళాలు దెబ్బతినటం.