రొమాన్స్‌లో సిక్స్‌

సెక్స్ టాయ్స్ కొనుగోలులో ఆరో స్థానంలో హైదరాబాద్

భారత్‌లో పెరిగిన కొనుగోళ్లు
62% మగాళ్లు, 38% మహిళలు
ఆన్‌లైన్ విక్రయ సంస్థ సర్వేలో వెల్లడి
హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి):సెక్స్‌.. గతంలో ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేవారు.. అలాంటిది ఇప్పుడు లైంగిక ‘తృప్తి’ కోసం ఏకంగా సెక్స్‌టాయ్స్‌నే కొనేస్తున్నారు! విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు మనదగ్గరా పెరిగిపోతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఈ సెక్స్‌టాయ్స్‌ కొనుగోళ్లలో హైదరాబాద్‌ నగ రం దేశంలోనే ఆరోస్థానంలో ఉండడం! మన దేశంలో సెక్స్‌ ప్రోడక్ట్స్‌ విక్రయించే ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగుచూశాయి.
 
సెక్సు ఉత్పత్తుల కోనుగోళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా టాప్‌ 5లో మూడు దక్షిణాది రాష్ట్రాలు ఉండడం గమనార్హం. ఇటీవలికాలంలో మనదేశంలో సెక్స్‌ టాయ్స్‌ వాడకం బాగా పెరిగిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజా సర్వే భారతీయుల ‘శృంగార జీవితం’ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సెక్స్‌ టాయ్స్‌ కొంటున్న వారిలో 62 శాతం పురుషులు కాగా.. 38 శాతం మహిళలట! సర్వేలో భాగంగా గడిచిన నాలుగున్నరేళ్లుగా తమకు వస్తున్న ఆర్డర్లతో పాటు వినియోగదారులతో మాట్లాడిన తర్వాత ఆన్‌లైన్‌ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. తమకు మొత్తం 80 వేల ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.
 
 మగాళ్లు రాత్రి.. ఆడాళ్లు పగలు..!
మగవారిలో 62 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెక్స్‌ ప్రోడక్ట్స్‌ కోసం ఆర్డర్లు ఇస్తుండగా.. ఆడవారిలో 38 శాతం మంది ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట మధ్యలో చేస్తారట. బరోడ, పుణె, తిరువనంతపురాల్లోని మహిళలు పురుషుల కంటే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో గడిచిన ఏడాది కాలంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు 25 శాతానికి పైగా పెరిగాయట.
 
కొనుగోళ్లలో టాప్‌ రాష్ట్రాలివే..
1. మహారాష్ట్ర 2. కర్ణాటక 3. పశ్చిమబెంగాల్‌ 4. తమిళనాడు 5. ఆంధ్రప్రదేశ్‌ 6. గుజరాత్‌ 7. ఉత్తరప్రదేశ్‌
 
నగరాల్లో..
1.ఢిల్లీ 2.ముంబై 3. బెంగళూరు 4. చెన్నై 5. కోల్‌కతా 6. హైదరాబాద్‌ 7. పుణె 8. అహ్మదాబాద్‌
 
ప్రాంతానికో టేస్ట్‌..!
సెక్స్‌ టాయ్స్‌ కొనుగోలులో ఒక్కోప్రాంతం వారిది ఒక్కో టేస్ట్‌ అట..! పశ్చిమ బెంగాల్‌ వాసులు కేండీ ఫ్యాంటీస్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తారని ఆ సంస్థ తెలిపింది. పంజాబ్‌ వాసులు లైంగిక ఉద్రేకాలనిచ్చే ఉత్పత్తులను, అసోం వాళ్లు బీడీఎస్‌ఎం ప్రోడక్ట్స్‌, ఉత్తరప్రదేశ్‌ వాసులు అంగం సైజు పెంచే ఉత్పత్తులను, హైదరబాద్‌ వాసులు సెక్సీ కట్‌ డ్రాయర్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. తెలంగాణ వాసులు సెక్సీ లోదుస్తులు ఎక్కువగా కొంటున్నారట!!
 
వయసుల వారీగా కొంటున్నారిలా..
వయసు కొనేవారు
18-24 22 శాతం
25-34 44 శాతం
35-45 18 శాతం
45 ప్లస్‌ 16 శాతం
 25-34 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ‘రిపీటెడ్‌ కస్టమర్స్‌’ అట!
 35-45 ఏళ్ల వారు ఈ సెక్స్‌టాయ్స్‌ కొనడం ఏడాది కాలంగా బాగా పెరిగిందని ఆన్‌లైన్‌ సంస్థ తెలిపింది.
రోజూ శృంగారంలో 10 కోట్ల మంది!
 మంగళూరు వాసులు సెక్స్‌ కోసమే షాపింగ్‌ చేస్తారట.
 భోపాల్‌ వాళ్లు కండోమ్స్‌లోని అన్ని ఫ్లేవర్లను వాడేస్తారట!
 ఎక్కువగా అమ్ముడయ్యేది మసాజ్‌ ఆయిల్స్‌.
 నాగ్‌పూర్‌ వాసులు ఇచ్చిన ఆర్డర్స్‌ను స్వయంగా కలెక్ట్‌ చేసుకుంటారట.
 దేశంలో రోజూ 10 కోట్ల మంది ప్రజలు శృంగారంలో పాల్గొంటున్నారట!
 ప్రపంచంలో సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉండే దేశాల్లో మనది ఐదో ర్యాంకు.
 ‘ఇండియన్‌ బాబీ’ పేరుతో ఎక్కువ మంది పోర్న్‌ వీడియోల కోసం సెర్చ్‌ చేస్తున్నారట.
వారికవి.. వీరికివి..
మగవారికి అత్యంత ఇష్టమైన సెక్స్‌ ప్రోడక్ట్స్‌ లూబ్రికెంట్స్‌ అయితే.. ఆడవారు మాత్రం అత్యధికంగా మసాజర్స్‌ కొంటున్నారట! వీటి తర్వాత సెక్సీ స్ర్పేలు, సెక్సీ లోదుస్తులు, ప్లెజర్‌ రింగ్స్‌, లైంగిక ఉద్రేకాలను కలిగించే లోషన్స్‌ను బాగా ఆర్డరిచ్చారట.
 
సర్వేలో తెలిసిందేంటంటే..
సెక్స్‌ ప్రోడక్ట్స్‌ కొనుగోళ్లలో నగరాల వారీగా చూస్తే ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా ముంబై ద్వితీయ స్థానంలో ఉందట! ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏడాది కాలంలో సెక్స్‌ టాయ్స్‌ కొనుగోళ్లు బాగా పెరిగాయని సర్వేలో తేలింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో నోయిడా మొదటి స్థానంలో నిలవగా.. లఖ్‌నవ్‌, గుడ్‌గావ్‌, చండీగఢ్‌, జైపూర్‌లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తృతీయ శ్రేణి పట్టణాల విషయానికొస్తే.. ఈశాన్య భారతంలోని షిల్లాంగ్‌ వాసులు అత్యధికంగా సెక్స్‌ టాయ్స్‌ కొంటున్నట్లు తేలింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని నాందేడ్‌, మణిపూర్‌లోని ఇంఫాల్‌, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పట్టణాలు ఉండడం విశేషం.