బెడ్‌రూమ్‌లో మీ టాలెంట్‌కు రేటింగ్‌

అందుబాటులోకి రానున్న ‘స్మార్ట్‌ కండోమ్‌’

లైంగిక వ్యాధులను కూడా గుర్తించే పరికరం
లండన్‌, డిసెంబరు 1:టెక్నాలజీ ఇప్పుడు అన్ని రంగాలకూ విస్తరిస్తోంది. శరీరంలో అన్ని అంగాల పనితీరునూ విశ్లేషిస్తోంది. చివరకు పురుషాంగంతోసహా! ఈ క్రమంలోనే ప్రపంచంలోనే తొలి ‘స్మార్ట్‌ కండోమ్‌’ అందుబాటులోకి రానుంది. పడక గదిలో పురుషుల ప్రతిభను అంచనా వేస్తూ..సన్నిహిత క్షణాలపై కూడా నిఘా పెడుతుంది. అంతేకాదు సెక్స్‌ సమయంలో ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయో లెక్కగట్టడంతోబాటు.. లైంగికంగా సంక్రమించే వ్యాధులను కూడా గుర్తిస్తుంది. నిజానికి ఇది కండోమ్‌ కాదు. సెక్స్‌ టాయ్‌ని పోలిన పరికరం మాత్రమే! నిజమైన కండోమ్‌తోబాటే ఈ గుండ్రని పరికరాన్ని కూడా ధరించాలి. దీనికి ‘ఐ కాన్‌’ అని పేరు పెట్టింది బ్రిటీష్‌ కండోమ్స్‌ కంపెనీ! ఓ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి అనుసంధానమై స్మార్ట్‌ కండోమ్‌ పనిచేస్తుంది.
 
బిల్టిన్‌ నానో చిప్‌, బ్లూటూత్‌ ద్వారా.. సమయం, వేగం తదితర డేటాను స్మార్ట్‌ఫోన్‌కి పంపిస్తుంది. ఆ డేటాను యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకుని చూసుకోవచ్చు. ఈ సమాచారాన్ని అంతా ఐ కాన్‌ పరికరం రహస్యంగా ఉంచుతుంది. యూజర్లు కోరుకుంటే డేటాను షేర్‌ చేసుకోవచ్చు. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే.. 6-8 గంటల పాటు స్మార్ట్‌ కండోమ్‌ పనిచేస్తుంది. మరి ధర? 81 డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5200కు పైమాటే! ఈ స్మార్ట్‌ కండోమ్‌ను ఇప్పటికే 90వేలమంది ప్రీఆర్డర్‌ చే శారట!