ఇవి తింటే శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుందట..

24-09-2017: పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తినే పిజ్జాల వలన శృంగార ఆసక్తి తగ్గిపోతుంది అంటున్నారు పరిశోధకులు.ఇప్పటి వరకూ పిజ్జాలు తినడం వలన గుండె సంబంధిత జబ్బులు, ఊబకాయం వస్తుందన్న విషయం తెలిసిందే! అయితే శృంగారంపై ఆసక్తి తగ్గడం లేదా పూర్తిగా నశించడం జరుగుతుందని తాజా పరిశోధనలో వారు చెబుతున్నారు. 21 – 40 మధ్య వయస్సుగల సుమారు 800 మంది స్త్రీ పురుషుల మీద వీరు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి ప్రతిరోజూ పిజ్జా అందించారు. మరో గ్రూపు వారికి ఇవ్వలేదు. కొన్ని నెలల అనంతరం పరిశీలించగా పిజ్జాలు తిన్న గ్రూపులో 15 శాతం మందిలో శృంగార కాంక్ష ఆసక్తి పూర్తిగా తగ్గిన విషయాన్ని గమనించారు. వీరిలో బరువు కూడా ఎక్కువగా ఉన్న విషయం గుర్తించారు. అయితే అధికబరువుకీ, శృంగారానికీ సంబంధం ఉందా? అన్న విషయం మీద ఇంకా అధ్యయనాలు నిర్వహించాల్సి ఉందని వారు చెబుతున్నారు.