లైంగిక ఆరోగ్యం కావాలి మన సొంతం

ఆంధ్రజ్యోతి, 03-01-2012: శృంగారం జీవితంలో ఒక అత్యంత ప్రధాన భాగం. ఏ కారణంగా నైనా లైంగిక లోపాలు ఏర్పడిన వారిలో మానసికమైన ఉల్లాసం, ఉద్యోగ బాధ్యతల పట్ల ఉత్సాహం బాగా తగ్గిపోతాయి. పైగా లైంగిక లోపాలు, మొత్తంగా శరీర అనారోగ్యాన్ని సూచిస్తాయి. నిజానికి లైంగిక ఆరోగ్యాన్ని నిలుపుకోవడం అంటే మొత్తంగా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్‌ ఎం నరసింహ. 

శృంగారం మానసిక నిశ్చలత్వాన్ని ఇస్తుంది. అందుకే లైంగిక సమస్యలు ఉన్న వారు మానసికంగా ఏదో కోల్పోయిన భావనకు గురవుతూ ఉంటారు. ఎప్పుడో అరుదుగా తప్ప లైంగిక సమస్యలకు మొత్తంగా శరీర అనారోగ్యమే కారణమవుతూ ఉంటుంది. వాస్తవానికి, లైంగిక అవయవాల్లోనే సమస్యలు ఉండడం అన్నది అతి కొద్ది మందిలోనే కనిపిస్తుంది. ఏమైనా ఆధునిక జీవన విధానాలు, ఆహారపు అలవాట్ల కారణంగా మగవారిలో అంగస్తంభన సమస్యలు, శ్రీఘ్రస్ఖలన సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మగవారిలో అంగస్తంభన సమస్యలతో బాధపడేవారు 30 శాతం మంది, శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడేవారు 40 శాతం మంది దాకా ఉంటున్నట్లు కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఇక మధుమేహం ఉన్న వారిలో అయితే, అంగస్తంభన సమస్యతో బాధపడే వారి సంఖ్య 60 శాతం దాకా ఉంటోంది. అంగ స్తంభన సమస్యల్లో అంగం తగినంతగా స్తంభించకపోవడం, స్తంభించినా ఎక్కువ సమయం ఉండకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలికంగా లైంగిక సమస్యలు ఉన్న వారిలో క్రమంగా మానసిక సమస్యలు కూడా మొదలువుతాయి. మనసులో ఆత్మన్యూనతా భావం నిండిపోయి ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతూ ఉంటారు. ముందు శీఘ్రస్ఖలన సమస్యగానే ఉన్నా, ఆ తరువాత ఒక దశలో అది అంగస్తంభన సమస్యలకు దారి తీయవచ్చు. కాకపోతే, ఈ రెండు సమస్యల్లోనూ కోరికలేమీ తగ్గవు. 

అసలు కారణాలు 
పురుషుల్లోని లైంగిక సమస్యలకు శారీరక, మానసిక కారణాలు రెండూ మూలంగా ఉంటాయి.. మానసిక ఒత్తిడి, ఆందోళన, భయాలు, డిప్రెషన్‌ వంటివి ఎక్కువ కాలం ఉంటే అవి కూడా లైంగిక శక్తిని దెబ్బ తీస్తాయి. శారీరక కారణాలను పరిశీలిస్తే, వాటిలో కొన్ని పెరిగే వయసు మీద కొంత ఆధారపడి ఉంటుంది. చాలా మందిలో వయసు పెరిగే కొద్దీ అంగ స్తంభన సమస్యలు కూడా పెరుగుతాయి. 
మద్యపానం, పొగతాగడం,అధిక బరువు వల్ల కూడా ఒక దశలో అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి . 
మధుమేహం, నాడీ సంబంధ వ్యాధులు, సుఖవ్యాధులు, గుండె జబ్బులు కూడా లైంగిక సమస్యలకు కారణమవుతాయి. 
కొన్ని రకాల హార్మోన్‌ సమస్యలతో పాటు, అధిక రక్తపోటు, అల్సర్లు, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా కొందరిలో శృంగార సమస్యలు మొదలవుతాయి. 

వ్యాధి నిర్ధారణ 
లైంగిక సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని రకాల హార్మోన్‌ పరీక్షలతో పాటు పినైల్‌ డాప్లర్‌ వంటి పరీక్షలు ఉపయోగపడతాయి. వ్యాధి ఉన్నట్లు తేలితే అందుకు అవసరమైన వైద్య చికిత్సలు ఉంటాయి.
 
వాజీకరణ చికిత్స 
లైంగిక సమస్యలను సమర్థవంతంగా నివారించే ఔషధాలెన్నో ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇవి ఏ మాత్రం దుష్ప్రభావం లేకుండా సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాయి. లైంగిక సమస్యలకు సంతాన లేమి సమస్యలకు ప్రాచీన ఆయుర్వేద సంహితాల్లో పేర్కొన్న ప్రత్యేక వైద్య విధానమే వాజీకరణ చికిత్స. వాజీకరణ ఔషధాలను 4 నుంచి 6 మాసాల పాటు క్రమం తప్పకుండా వాడితే, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాకపోతే ఈ వైద్య చికిత్సలు ఆయుర్వేదంలో మంచి నిపుణులైన వారి పర్యవేక్షణలో తీసుకున్నప్పుడే ఆశించిన స్థాయి ఫలితాలు వస్తాయి. వాజీకరణ తో పాటు పంచకర్మ చికిత్సలు కూడా ఉండడం వల్ల లైంగిక సామర్ధ్యం బాగా పెరుగుతుంది. శీఘ్ర స్ఖలన సమస్య ఉన్న వారికి ప్రత్యేకించి శుక్రస్తంభన ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయి. వాజీకరణ ఔషఽఽధాలను 20 నుంచి 70 ఏళ్ల వయసు దాకా ఎవరైనా వాడవచ్చు. అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్య, సంతాన సమస్యలన్నిటికీ వాజీకరణ చికిత్సల ద్వారా ఫలితాలను పొందవచ్చు. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయకుండా అనుభవజ్ఞులైన ఆయుర్వేద నిపుణులతో వైద్య చికి త్సలు తీసుకుంటే లైంగిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 

డాక్టర్‌ ఎం నరసింహ 
సెక్సాలజిస్టు(ఆయుర్వేదం) 
సాయిబాలాజి ఫెర్టిలిటీ క్లినిక్‌, జె.సి బ్రదర్స్‌ ఎదురుగా, అమీర్‌పేట, హైదరాబాద్‌ 
ఫోన్స్‌: 9246564433, 9391383922టగర్సఝ