ఆ ఆసక్తి పెంచే ఆహారం

ఆంధ్రజ్యోతి, 05-12-2017: సెక్స్‌ మీద ఆసక్తి సన్నగిల్లిందంటే అందుకు తోడ్పడే పదార్థాల్ని ఆహారం చేర్చుకోవట్లేదని గ్రహించాలి. ఓ అధ్యయనంలో లైంగికాసక్తి సన్నగిల్లటానికి ‘విటమిన్‌ డి’ లోపం ప్రధాన కారణమని తేలింది. కాబట్టి ‘డి’ విటమిన్‌ ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు, గుడ్లు, కార్న్‌ఫ్లేక్స్‌ను ఆహారంలో చేర్చుకోవటంతోపాటు లైంగికాసక్తిని పెంచే ఈ కింది పదార్థాలను కూడా తినాలి.

డార్క్‌ చాక్లెట్లు:వీటితో మెదడులోని సెరటోనిన్‌, డోపమైన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. దాంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటాం. లైంగిక క్రీడలో పాల్గొనటానికి ఇలాంటి భావనలు అత్యవసరం.
 
నట్స్‌: శక్తిని పెంచే నట్స్‌ వల్ల లైంగికాసక్తి పెరగటంతోపాటు పురుషుల్లో నపుంసకత్వం తగ్గుతుందని పరిశోధనల్లో రుజువైంది. వాల్‌నట్స్‌, వేరుసెనగ పప్పులు పురుషుల్లో సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి.
 

ఓట్స్‌:ఓట్స్‌ తినటం వల్ల రక్తంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ పరిమాణం పెరుగుతుంది. ప్రతిరోజూ ఆహారంలో ఓట్స్‌ చేర్చుకోవటం వల్ల 8 వారాల్లో లైంగికాసక్తి పెరుగుతుంది

విటమిన్‌ బి3: లైంగిక శక్తికి అవసరమైన అనిరోబిక్‌ మెటబాలిజాన్ని పర్యవేక్షిస్తూ, జననేంద్రియాలకు రక్త సరఫరాను వృద్ధి చేస్తుంది. ఈ విటమిన్‌ చేపల్లోయ ఎక్కువ. కాబట్టి వాటిని తరచుగా తింటూ ఉండాలి.