లైంగిక బంధానికి మెంతుల వైద్యం

03-02-2018: శృంగారంపై ఆసక్తి పెరగటానికి చాలామంది పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం మునక్కాడలలాంటి పదార్థాలను తింటుంటారు. అయితే ఇవి ఎంతవరకు పనిచేస్తాయనేది శాస్త్రీయంగా రుజువు కాలేదు. అయితే మెంతులు శృంగారంపై ఆసక్తి పెరిగేలా చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మగవారు తరచూ మెంతులను తీసుకుంటే వారికి శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్టు తేలింది. ఈ పరిశోధనలో భాగంగా కొందరికి ఆరు వారాల పాటు మెంతుల సారాన్నిఇచ్చి పరిశీలించగా వారిలో శృంగారాసక్తి పెరిగినట్టు వెల్లడైంది. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని అమితంగా ప్రేరేపిస్తాయి. అందుకే మెంతులు శృంగారంపై ఆసక్తి పెరిగేందుకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.