పెళ్లి కాని అమ్మాయిల్లో కండోమ్ వినియోగం ఆరురెట్లు పెరిగింది...

29-01-2018: గడచిన దశాబ్ద కాలంలో పెళ్లి కాని అమ్మాయిల్లో కండోమ్స్ వినియోగం ఆరు రెట్లు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 లో వెల్లడైంది. పెళ్లి కాకుండానే లైంగిక చర్యల్లో పాల్గొంటున్న మహిళల్లో సురక్షితమైన లైంగికచర్యల కోసం కండోమ్స్ వాడుతున్నారని తేలింది. గడచిన పదేళ్లలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు మహిళలు పెళ్లి కాకుండానే లైంగిక చర్యల్లో పాల్గొంటున్న వారి శాతం 2 నుంచి 12 శాతానికి పెరిగిందనే వాస్తవం ఆరోగ్యమంత్రిత్వ శాఖ సర్వేలో వెలుగుచూడటం సంచలనం రేపింది.20 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు గల పెళ్లికాని మహిళలే ఎక్కువగా కండోమ్స్ వాడుతున్నారని సర్వేలో తేలింది. 8 మంది మహిళల్లో ముగ్గురు మహిళలు గర్భస్రావం చేయించుకుంటున్నారు. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు వివాహిత మహిళల్లో 99 శాతం మంది గర్భనివారణ చర్యలు పాటిస్తున్నారని వైద్యశాఖ సర్వే వెల్లడించింది. మహిళల్లో ఎక్కువమంది ఇప్పటికీ సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నారని వైద్యశాఖ సర్వే తేల్చి చెప్పింది.