సెక్సో క్లాక్‌!

ఆంధ్రజ్యోతి, 15-02-2017: కూడు, గూడు, గుడ్డ తర్వాత మనిషి ప్రాధాన్యమిచ్చేది తిండి, నిద్ర, సెక్స్‌కే. ప్రస్తుతకాలంలో ఈ మూడింటికీ టైమింగ్స్‌ లేవు. గతంలో సంప్రదాయబద్ధంగా, నియమబద్ధంగా ఉమ్మడికుటుంబాల్లో ఈ దినచర్యలన్నింటినీ వయసుకు అనుగుణంగా క్రమపద్ధతిలో పాటించేట్టు తర్ఫీదు ఇచ్చేవారు. ఇప్పుడా అవకాశం, అనుకూలత సమాజానికి లేదు. ప్రస్తుత అలవాట్లకు అనుగుణంగా సెక్స్‌ టైమింగ్స్‌ విషయంపై బ్రిటన్‌లో రెండువేలమందిని ఎంపికచేసి అధ్యయనం చేశారు. వారి వారి అవకాశాన్నిబట్టి సెక్స్‌లో పాల్గొనే టైమింగ్స్‌ పరిశీలించారు. వీరిలో ప్రతి పదిమందిలోనూ ఎనిమిదిమంది వారాంతంలో ఒకే సెక్స్‌ టైమింగ్స్‌ పాటిస్తున్నట్లు చెప్పారు. వాటినే బెస్ట్‌ టైమింగ్స్‌గా అధ్యయనవేత్తలు పేర్కొన్నారు.
 
విశ్రాంతిరోజుల్లో (సబ్బాత్) అంటే శనివారం, ఆదివారాల్లో వీరు ఎక్కువ సెక్స్‌లో పాల్గొంటున్నారు. సెక్స్‌లో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం తొమ్మిదిగంటల సమయం సెక్స్‌ సంబంధాలకు అత్యంత అనుకూలమైనదని ఎక్కువమంది ఆ సమయమే ఎంచుకున్నారని వెల్లడించారు. మంగళవారం రాత్రి తొమ్మిదిగంటల సమయం సెక్స్‌కి అత్యంత మనోహరమైనదని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ఆదివారంకంటే శనివారం ఉదయం 10.30, 11.30, శనివారం రాత్రి 9.30, 11.15, 11.30 ఆదివారం రాత్రి 9.30 సమయాలు టాప్‌ స్లాట్స్‌గా పేర్కొంటున్నారు. శుక్రవారం రాత్రి 10.30 సమయం కూడా మోస్ట్‌ పాపులర్‌ టైమింగ్‌గా, టాప్‌ ఫేవరెట్‌ టైమింగ్‌గా అధ్యయనం పేర్కొంది.
 
శీతాకాలాన్ని పదహారుశాతం మంది ఇష్టపడగా, వసంత రుతువును 14 శాతం మంది, వేసవికాలాన్ని నాలుగుశాతంమంది సెక్సీయస్ట్‌ సీజన్‌గా పేర్కొన్నారు. ఫోర్‌ప్లేకి ముందు మద్యం సేవిస్తామని 22 శాతం మంది చెప్పారు. దీర్ఘకాలిక లైంగిక సంబంధాలున్నవారు రోబోటిక్‌ తరహాలో సెక్స్‌ చేస్తే బోరింగ్‌, రొటీన్‌ ఫీలవుతారని, పైన పేర్కొన్న టైమింగ్స్‌ ట్రై చెయ్యాలనీ హైస్ర్టీట్‌ కెమిస్ట్‌, సెక్స్‌ ఎడ్యుకేటర్‌ అలిక్స్‌ ఫాక్స్‌ సలహా ఇస్తున్నారు. పైన పేర్కొన్న పాపులర్‌ టైమింగ్స్‌ కనుక పాటిస్తే రిలాక్సేషన్‌కి కావాల్సినంత సమయం దొరుకుతుందని ఆమె అంటున్నారు.