వీధిలో శబ్దాలతో పురుషుల్లో సంతానలేమి

ఆంధ్రజ్యోతి, 30-6-2017: నిత్యం రద్దీగా ఉండే రోడ్ల పక్కనే నివాసం ఉంటున్నారా ? అయితే, జాగ్రత్త! వేగంగా దూసుకెళ్లే వాహనాలు, ఇతర శబ్దాలు పురుషులలో సంతానోత్పత్తి శక్తిని క్షీణింపజేస్తున్నాయని సియోల్‌ నేషనల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పురుషుల సంతానోత్పాదక సామర్థ్యంపై వారు నివసించే వాతావరణ ప్రభావం ఏమేరకు ఉందనే దిశగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందన్నారు. కాగా, ఇళ్లలో బిగించిన ఏసీలతోనూ ఈ ముప్పు పొంచి ఉందని వర్సిటీ పరిశోధకుడు జిన్‌ యంగ్‌ మిన్‌ తెలిపారు.