ఉన్ని స్లిప్పర్స్‌తో ఎన్ని లాభాలో!

26-07-2017:వర్షాకాలంలో జడివాన పట్టుకుంటే చాలు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఇంట్లో చలువరాతి ఫ్లోర్‌ ఉంటే.. నడుస్తున్నప్పుడు కాళ్లు చల్లబడిపోతాయి. రక్తప్రసరణ సరిగా జరగదు. కొన్నిసార్లు కాళ్లు తిమ్మిర్లు ఎక్కినట్లు అయిపోతాయి. దానికితోడు ఇంట్లో చెమ్మ ఉన్నప్పుడు బ్యాక్టీరియా కాళ్ల పగుళ్లలోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్లను కలుగజేయవచ్చు. అందుకని ఇండోర్‌ ఉలెన్‌ స్లిప్పర్స్‌ను వేసుకోవచ్చు. ఇంట్లో వేసుకున్నప్పుడు తిరగడం తేలిక. ఇవి అత్యంత తక్కువ బరువు కలిగి ఉంటాయి. వీటిని నూరు శాతం గొర్రె ఉన్నితో తయారు చేస్తారు కాబట్టి.. రాత్రివేళల్లో వెచ్చగా, హాయిగా ఉంటాయి. వర్షాకాలపు చలి రాత్రుల్లో తొడుక్కుంటే కొంత సౌఖ్యంగా ఉంటుంది. చలికి కాళ్లు పగలవు. చర్మం ముడచుకుపోదు. ఉలెన్‌ స్లిప్పర్స్‌ను నీళ్లలో వేసి శుభ్రం చేసుకోవచ్చు. ఇవి మార్కెట్‌లో రకరకాల రంగులలో దొరుకుతున్నాయి. సుమారుగా వీటి ధర మూడొందల నుంచి ఆరొందల రూపాయల వరకు ఉండొచ్చు.