వేడికి దద్దుర్లు వస్తే..

ఆంధ్రజ్యోతి, 10-04-2017:కలబందను కట్‌ చేసి దద్దుర్లపైన మెల్లగా రాయాలి. రోజుకు మూడు సార్లు ఇలా చేయాలి. కలబంద మొక్క లేని వారు మార్కెట్లో దొరికే అలొవెరా జెల్‌ ఉపయోగించవచ్చు. వేడిమి వల్ల వచ్చే పొక్కులను నివారించే గుణం కలబందలో ఉంది.

గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు బేకింగ్‌ సోడా లేదా ఓట్‌మీల్‌ పౌడర్‌ను వేసి ఆ నీటితో స్నానం చేయాలి. వేడి పొక్కుల వల్ల కలిగే మంట, దురదను తగ్గించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
దద్దుర్లు ఏర్పడిన చోట ఐస్‌ప్యాక్‌ పెట్టడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. శనగపిండిని తీసుకుని కొంచెం నీటిని కలిపి పేస్ట్‌ మాదిరిగా చేసుకుని రాషె్‌సపైన అప్లై చేసినా ఫలితం కనిపిస్తుంది.