దద్దుర్లు దరిచేరకుండా...

31-08-2017: వర్షాకాలంలో చర్మంపై దద్దుర్లు బాగా వస్తాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వర్షాల వల్ల చర్మం మీదదద్దుర్లు తలెత్తుతుంటాయి. ఇవి రాకుండా నిరోధించేందుకు సహజ చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవి....

అలొవెరా జెల్‌లో యాంటి-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. అందుకే దద్దుర్ల నివారణంలో ఇది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్‌-ఇ కూడా పుష్కలంగా ఉంది.

మంజిష్టాలో వేప పొడి, కొబ్బరినూనె వేసి పేస్టులా చేసి చర్మంపై రాసుకుంటే దద్దుర్ల సమస్య ఉండదు. మంజిష్టాలో యాంటి-ఇన్‌ఫ్లమేటరీ సుగుణాలు ఉన్నాయి.

వేప సహజసిద్ధమైన క్లీన్సర్‌. ఇది రక్తాన్ని కూడా శుద్ధిచేస్తుంది. యాంటి-ఫంగల్‌, యాంటి-బాక్టీరియల్‌ సుగుణాలు ఉన్న క్విర్‌సెటిన్‌ లాంటివి ఇందులో బాగా ఉన్నాయి. ఇవి దద్దుర్లు రాకుండా చర్మంపై మందులా పనిచేస్తాయి.

శాండల్‌వుడ్‌ పౌడర్‌లో కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి పేస్టులా చేసి దాన్ని చర్మంపై రాసుకుని 5 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై దద్దుర్లు రావు.

పసుపులో యాంటి-ఎలర్జిక్‌, యాంటిసెప్టిక్‌ సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. శాండల్‌వుడ్‌ పౌండర్‌ లేదా ముల్తాని మిట్టిలో చిటికెడు పసుపు వే సి పేస్టులా చేసి చర్మంపై రాసుకుంటే దద్దుర్లు రాకుండా నిరోధించవచ్చు.

టీ ట్రీ ఆయిల్‌లో యాంటి ఫంగల్‌ సుగుణాలు బాగా ఉన్నాయి. అందులో కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా కలిపి తలస్నానం చేసిన తర్వాత చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద దద్దుర్లు రాకుండా నివారించవచ్చు.

పుచ్చకాయ ముక్కలను గుజ్జులా చేసి దాన్ని చర్మంపై రాస్తే చర్మానికి కావాలసిన తేమ అందుతుంది. అంతేకాదు చర్మానికి కావాల్సిన చల్లదనాన్ని కూడా ఇది పంచుతుంది.