వానలో పాద రక్షలు

07-09-2017: వానాకాలం వచ్చిందంటే అప్పటిదాకా వేసుకున్న ఫ్యాషన్‌ శ్యాండిల్స్‌, షూలను అటకెక్కించేస్తాం. కానీ, అందమైన దుస్తులకు మ్యాచింగ్‌ చెప్పులు వేసుకోలేకపోయామనే బాధ వేధిస్తూ ఉంటుంది. ఇలా మీరూ బాధ పడుతున్నారా? ఇవిగో ఈ మాన్‌సూన్‌ స్టయిల్స్‌ ఫాలో అయిపోతే చెప్పులతోపాటు, మీరూ ట్రెండ్‌కి తగ్గట్టు ఫిక్స్‌ అయిపోతారు.
  
లాంగ్‌ బూట్స్‌
మినీ స్కర్ట్‌లు, క్యాప్రిలు వేసుకున్నప్పుడు లెదర్‌ లాంగ్‌ బూట్స్‌ బదులుగా రబ్బర్‌ లాంగ్‌ బూట్స్‌ వేసుకోండి. కాళ్లు వాన నీటికి తడవకుండా ఉండటంతోపాటు స్టయిల్‌ చెక్కుచెదరకుండా ఉంటుంది.
  
షార్ట్‌ బూట్స్‌
జీన్స్‌, టీషర్ట్‌ల కోసం స్పోర్ట్స్‌ షూస్‌ వేసే కాలం కాదిది. అలాగని ఈ డ్రస్‌లకు అన్ని రకాల బూట్లు నప్పవు. అందుకేషార్ట్‌ బూట్స్‌ సెలెక్ట్‌ చేసుకుంటే రెయినీ సీజన్‌ను ఎలాంటి ఇబ్బందీ లేకుండా గడిపేయొచ్చు.
 
రెయిన్‌ శ్యాండిల్స్‌
శ్యాండిల్స్‌ చీరలు, ఘాగ్రా చోళీలు, లాంగ్‌ స్కర్ట్‌లకు ఇవి చక్కగా నప్పుతాయి. వర్షాకాలం చెప్పులు చెక్కు చెదరకుండా ఉండాలంటే మాత్రం రెయిన్‌ శ్యాండిల్స్‌ ట్రై చేయండి.
 
స్కిమ్మర్స్‌
చుడీదార్‌ వేసుకుంటే దానికి మ్యాచింగ్‌గా వేసుకునే వెడ్జెస్‌ బదులు, వానాకాలం ఈ స్కిమ్మర్స్‌ వేసుకోండి. పాదానికి చక్కగా హత్తుకుని ఆకర్షణీయంగా కనిపించటంతోపాటు వాన నీటికి ఈ చెప్పులు పాడవకుండా ఉంటాయి.