టైఫాయిడ్‌, మలేరియాపై పోరాడే స్టాటిన్‌

23-08-2017: రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గించే స్టాటిన్‌, ఏజెటిమైబ్‌ ఔషధాలు కూడా మలేరియా, టైఫాయిడ్‌ లాంటి అంటువ్యాధుల్ని అడ్డుకుంటాయని అధ్యయనంలో తేలింది. ఎక్కువ ఇన్ఫెక్షన్‌ ఉండే వ్యాధులనూ కొందరు ఎలా ఎదుర్కొనగలుగుతున్నారన్న దిశగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు జన్యు రూపాంతరం కొలెస్ట్రాల్‌ స్థాయులపై ప్రభావం చూపుతుందని, దానితోనే టైఫాయిడ్‌ జ్వరం వస్తుందని తెలిసింది. అలా స్టాటిన్‌ మం దులు వాడే వారిలో అంటువ్యాధులు రా కుండా ఉంటాయని తేలిందని పరిశోధకులు వెల్లడించారు.