టూర్‌ని ఎంజాయ్‌ చేయండిలా

ఆంధ్రజ్యోతి, 27-04-2017:వేడి నుంచి ఉపశమనం కోసం, కొత్త ప్రదేశాల సందర్శన కోసం సమయం దొరికేది ఇప్పుడే. అయితే వేసవిలో టూర్‌కు వెళుతున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...

టూర్‌కు వెళ్లాక అలసట అంటూ కూర్చోకుండా యాక్టివ్‌గా ఉండటానికి ప్రయత్నించండి. సైట్‌ సీయింగ్‌, వాకింగ్‌, షాపింగ్‌, స్విమ్మింగ్‌... లాంటివి చేస్తూ ఉల్లాసంగా గడపండి.

వేసవిలో టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే డీహైడ్రేషన్‌కు గురికాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ చెంతన వాటర్‌బాటిల్‌ ఉండేలా చూసుకోండి. తరచుగా జ్యూస్‌లు, లిక్విడ్స్‌ తీసుకోండి.

ఇంటి నుంచే కొంత ఫుడ్‌ను ప్యాక్‌ చేసి పట్టుకెళ్లండి. ప్రొటీన్‌ పౌడర్‌, నట్స్‌, చియా సీడ్స్‌ వంటివి వెంట తీసుకెళితే మంచిది.

సిటీకి దూరంగా వెళ్లాల్సి వచ్చినపుడు, ట్రెక్కింగ్‌లాంటివి చేస్తున్నప్పుడు దగ్గరలో ఎలాంటి ఆహారం దొరకకపోవచ్చు. కాబట్టి ముందే స్నాక్స్‌ ప్యాక్‌ చేసి తీసుకెళ్లండి.

మీరు విడిది చేసిన ప్రదేశానికి దగ్గరలో మార్కెట్‌ ఉంటే సందర్శించండి. ఫ్రూట్స్‌ కొని పెట్టుకోండి. క్యారెట్‌, కీరదోస, నిమ్మకాయలు కొన్ని కొనుగోలు చేయండి.

స్థానికంగా పేరుండే ఆహారం తినడానికి ప్రయత్నించకుండా మీకు నచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఆహారం రుచించకపోతే ఉడికించిన కోడిగుడ్లు, పండ్లు, ఓట్‌మీల్‌ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వండి.