‘లైంగిక’ రుగ్మతలకు హార్మోన్‌తో చికిత్స

ఆంధ్రజ్యోతి,జనవరి 25:లైంగికపరమైన మానసిక రుగ్మతలను తొలగించే రొమాంటిక్‌ హార్మోన్‌ను పరిశోధకులు గుర్తించారు. శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ‘కిస్‌పెప్టిన్‌’ హార్మోన్‌ ద్వారా సంతానలేమితో బాధపడుతున్న వారికి చికిత్స చేయవచ్చని బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు తెలిపారు. ఆ రుగ్మతతో బాధపడుతున్న 29 మందికి ఈ హార్మోన్‌ను ఇంజెక్షన్‌ ద్వారా అందించారు. వారి మెదడులో లైంగికపరమైన వాంఛలను ప్రేరేపించే ప్రాంతాలను ఈ హార్మోన్‌ ఉత్తేజపరిచిందని వారు చెప్పారు. ఇప్పటి వరకు జన్యు సంబంధలోపాలే సంతానలేమికి కారణమని భావించేవారని, లైంగికపరమైన మానసిక రుగ్మతలపై దృష్టిసారించలేదని భారతీయ శాస్త్రవేత్త వల్జిత ధిలో తెలిపారు. అయితే, ఈ హార్మోన్‌ వినియోగం ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరముందని ఆయన చెప్పారు.