పరిమాణమా? ప్రభావమా?

ఆంధ్రజ్యోతి, 09-01-2018: ప్రశ్న: డాక్టర్‌! లైంగిక తృప్తికీ, అంగం పరిమాణానికీ సంబంధం ఉంటుందా? నాకు త్వరలో పెళ్లి జరగబోతోంది. కాబోయే భర్త గురించి నాకెన్నో సందేహాలున్నాయి. ఆయన నాకు సంపూర్ణ తృప్తిని అందించగలరా? ఆయనలో లోపం ఉంటే దాన్ని ఎలా అధిగమించి లైంగిక సంతృప్తిని పొందవచ్చో వివరించండి.

- రాధ, నల్గొండ.
 
జవాబు: స్నేహితులు అంగ పరిమాణం గురించి తమ మిడిమిడి పరిజ్ఞానంతో ఏదేదో చెబుతూ ఉంటారు. పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే అంత తృప్తి పొందగలుగుతామనీ, అంగం పరిమాణం మీదే లైంగిక తృప్తి ఆధారపడి ఉంటుందనీ...ఇలా తోచినది, తమకు తెలిసినది చెబుతూ ఉండటం పరిపాటే! వీళ్ల మాటలు విని, నీలి చిత్రాల్లో కనిపించేవాటన్నిటినీ నిజమని నమ్మి మీలాంటి ఎంతోమంది అర్థం లేని అనుమానాలకు లోనవుతూ ఉంటారు. సెక్స్‌లో అంగం కంటే ఫోర్‌ప్లేదే పెద్ద పాత్ర. లైంగికోద్రేకాన్ని పెంచే ఫోర్‌ప్లే కొరవడినప్పుడు ఎంతటి అంగమైనా సంతృప్తిని ఇవ్వలేదు.
 
ఒకవేళ మీ వారి అంగం చిన్నదిగా ఉందని మీకనిపిస్తే, అందుకు తగ్గ భంగిమలను ఎంచుకుని సంపూర్ణ తృప్తిని పొందే వీలుంది. పురుషుడి కాళ్ల మధ్య స్త్రీ కాళ్లు ఉంచి ప్రయత్నించే గర్ల్‌ ఆన్‌ టాప్‌ పొజిషన్‌లో, క్లిటోరిస్‌ అతని ప్యూబిక్‌ బోన్‌కు తగిలేలా ఒరిపిడి కలిగించటం, వెనక నుంచి ప్రయత్నించే డాగీ స్టయిల్‌ మొదలైన భంగిమలు అనుకూలంగా ఉంటాయి. దంపతులిద్దరూ లైంగిక తృప్తిని సమంగా పొందాలంటే లైంగికోద్రేకాన్ని అందించే ప్రదేశాలను శోధించి, కొత్త ప్రయోగాలతో శృంగార జీవితాన్ని మథించాలి. ఇందుకు తగినంత సమయం, ఏకాంతం ఏర్పరుచుకోవాలి.
 
 
-డాక్టర్‌ షర్మిలా మజుందార్‌
చీఫ్‌ సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌,
ఏవిస్‌ హాస్పిటల్‌, జూబ్లీ హిల్స్‌, హైదరాబాద్‌.
Email: mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)