స్ఖలన సమస్య ఎందుకు?

ఆంధ్రజ్యోతి, 24-04-2018: డాక్టర్‌! నాకు రెండు నెలల క్రితం పెళ్లయింది. లైంగికోద్రేకం పొంది, శృంగారంలో పాల్గొన్న కొద్ది నిమిషాలకే నాకు స్ఖలనమైపోతోంది. దీంతో నా భార్య చాలా అసంతృప్తి చెందుతోంది. దీన్ని సమస్యగా భావించాలా?

 
- ఓ సోదరుడు, హైదరాబాద్‌.
 
సాధారణంగా స్ఖలనానికి సంబంధించి కొంతమంది పురుషుల్లో కొన్ని సమస్యలుంటాయి. పెళ్లయిన కొత్తలో కలయిక పూర్తి కాకుండానే స్ఖలనం జరగడం అనేది సర్వసాధారణం. అయితే ఈ సమస్య క్రమేపీ సర్దుకుంటుంది. ఒకవేళ నెలలు గడిచినా ఇలాగే ఉంటే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. ప్రి మెచ్యూర్‌ ఇజాక్యులేషన్‌ సమస్యలో ఫోర్‌ ప్లే సమయంలో లేదా అంగ ప్రవేశం జరిపిన కొద్ది క్షణాల్లో స్ఖలనం జరిగిపోతుంది. ఇంకొందరికి ఇన్‌హిబిటెడ్‌ లేదా రిటార్డెడ్‌ ఇజాక్యులేషన్‌ సమస్య ఉంటుంది. వీరికి స్ఖలనం చాలా ఆలస్యంగా జరుగుతుంది. ‘రిట్రోగ్రేడ్‌ ఇజాక్యులేషన్‌’ అనే సమస్య ఉన్నవారిలో భావప్రాప్తి పొందే సమయానికి వీర్యం శిశ్నం నుంచి బయటకు రాకుండా వెనక్కి తిరిగి మూత్రనాళం గుండా మూత్రాశయంలోకి చేరుకుంటుంది. అయితే సమస్య ఎలాంటిదైనా సాధ్యమైనంత త్వరగా సెక్సాలజిస్ట్‌ను సంప్రదించాలి. మీ విషయంలో శీఘ్రస్ఖలన సమస్యను స్టాప్‌ అండ్‌ స్టార్ట్‌ టెక్నిక్‌తో, మందుల సహాయంతో సరిదిద్దొచ్చు.


డా.షర్మిలా మజుందార్‌
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌,
email: mili77@gmail.com