కలుస్తున్నా... కలగట్లేదేం?

ప్రశ్న: ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులూ పాటించకుండా లైంగికంగా దగ్గరయినా నేను గర్భం దాల్చలేకపోయాను. ఇందుకు కారణం ఏమై ఉంటుంది? సంతానం కలగడం కోసం ఇంకొంత కాలం ఎదురు చూడొచ్చా? లేక వెంటనే కలవాలా?

సమాధానం: ఆరోగ్యకరమైన జంట ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులూ అవలంబించకుండా లైంగికంగా పాల్గొంటూ ఉంటే ఏడాదిలోపే గర్భం దాల్చటం ఖాయం. ఇలా జరగలేదంటే దంపతుల్లో ఒకరికి లేదా ఇద్దరికీ లోపం ఉందని అర్థం. చాలామంది దంపతులు గర్భధారణకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. అసలు గర్భం దాల్చడంలో కూడా ఇబ్బందులుంటాయనే విషయాన్ని అంగీకరించరు. కానీ నిజానికి ప్రతి తొమ్మిది జంటల్లో ఒకరికి గర్భ ధారణ సమస్యలుంటాయి.
 
ఏం చేయాలి?: సంవత్సరం నుంచి గర్భం దాల్చాలని మీరు చేసిన ప్రయత్నాలు విఫలమైనా, 35 ఏళ్లు దాటి ఉండి, ఆరు నెలలుగా గర్భధారణకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా వెంటనే వైద్యుల్ని సంప్రతించాలి. వైద్యులు స్త్రీపురుషులిద్దరికీ పరీక్షలు చేస్తారు. స్త్రీలల్లో అండం విడుదల, పురుషుల్లో శుక్ర కణాల పరిమాణం, నాణ్యత, చురుకుదనాలను పరీక్షల్లో గుర్తించి, లోపాలను చికిత్సతో సరి చేస్తారు. ఒకవేళ అప్పటికీ పిల్లలు కలగకపోతే ఫెర్టిలిటీ నిపుణుల సహాయం తీసుకోవలసి ఉంటుంది. వాళ్లు మాత్రమే లోతైన పరీక్షలతో గర్భధారణకు అడ్డు పడుతున్న విషయాలను కనిపెట్టగలుగుతారు.
 
 
డా షర్మిలా మజుందార్‌,
చీఫ్‌ సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకోఅనలిస్ట్‌,
Email :mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)