మళ్లీ మళ్లీ కావాలంటే?

25-06-2018: డాక్టర్‌! నాకు పెళ్లైన కొత్తలో ఒకదాని వెంట మరొకటిగా భావప్రాప్తులు (మల్టిపుల్‌ ఆర్గాజమ్స్‌) కలిగేవి. అలాంటివి ఉంటాయని పెళ్లికి ముందు పుస్తకాల్లో చదివాను. పెళ్లయ్యాక ప్రత్యక్షంగా అనుభవానికి లోనయ్యాను. అయితే రెండు ప్రసవాల తర్వాత నాకు ఆ అనుభవం కలగడం మానేసింది. మా వారు మంచి శృంగారపరులు. ఫోర్‌ ప్లే కూడా బాగా చేస్తారు. అయితే నాకు రెండు సార్లు వెంట వెంటనే భావప్రాప్తి కలగాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఒకసారి అయిన తర్వాత రెండవసారికి రెండు రోజుల సమయం పడుతోంది. ఆలోగా ఎంత ప్రయత్నించినా భావప్రాప్తిని అందుకోలేకపోతున్నాను. నా వయసు 40. పెళ్లై ఇప్పటికి 17 ఏళ్లు. తిరిగి పెళ్లైన కొత్తలో పొందిన అనుభవాన్ని పొందాలంటే నేనేం చేయాలి?
 
- ఓ సోదరి, బెంగుళూరు.
 
మల్టిపుల్‌ ఆర్గాజమ్స్‌ పొందడం అనేది సాధన వల్లే సాధ్యమవుతుంది. అంతేగానీ అదొక అదృష్టం లాంటిది కాదు. భావప్రాప్తికి చేరువచేయగలిగే మెలకువలు, ఆ స్థితి నుంచి బయటపడకుండా మళ్లీ మళ్లీ అదే అనుభవాన్ని పొందగలిగే పనితనాల మీద మనకు అవగాహన ఉన్నప్పుడే మల్టిపుల్‌ ఆర్గాజమ్స్‌ సాధ్యపడతాయి. వీటి కోసం కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే....
 
భావప్రాప్తి పొందేవరకూ లైంగిక క్రీడ ఆపకూడదు
అవసరానికి మించి ప్రయత్నించకూడదు. లేదంటే గాయాలు కాక తప్పదు.
ఫోర్‌ప్లే అవసరం
మొదటి భావప్రాప్తి తర్వాత ఆ వేగాన్ని అలాగే కొనసాగించాలి
భాగస్వామి అలసిపోయి, చాలనుకున్నప్పుడే ఆగాలి
శరీర దారుఢ్యం: మల్టిపుల్‌ ఆర్గాజమ్స్‌ పొందాలంటే అందుకు శ్రమపడే శక్తి సరిపడా ఉండాలి. ఆ సమయంలో శరీరం... ఫ్రిక్షన్‌, ఒత్తిడి, నరాల ఉత్తేజం... వీటిన్నిటికీ లోనవుతుంది. మీతోపాటు మీ భాగస్వామి కూడా ఈ పనికి సంసిద్ధంగా ఉండాలి. ఊపిరి తీసుకుని వదలడం, కండరాల పటుత్వాలను పెంచుకునే వ్యాయామాలతో ఎన్ని భావప్రాప్తులనైనా పొందవచ్చు. వీటిన్నిటి గురించీ అర్ధం చేసుకోండి. ఇంకోసారి లైంగికంగా దగ్గరయ్యేటప్పుడు ఒక భావప్రాప్తి పొందిన తర్వాత కూడా ఒకర్నొకరు ప్రేరేపించడానికి ప్రయత్నించండి. అలా చేయగలిగితే రెండవది, మూడవది కూడా పొందవచ్చు. 
 
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌, సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
email: mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)