సెక్సువల్ హెల్త్

19-02-2018ప్రశ్న: యోనిని శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్లు రావని నా భావన. ఇందుకోసం ‘డూషింగ్‌’ పద్ధతి అనుసరిస్తూ ఉంటాను. ఇలా చేయటం కరెక్టేనా?

 
జవాబు: చెడు వాసన వేయకూడదని, ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని... ఇలా మర్మాయవాల గురించి ఎన్నో అపోహలుంటాయి. శుభ్రత పాటించటం కోసం పదే పదే సబ్బుతో శుభ్రం చేసుకుంటూ, సువాసన వెదజల్లే పౌడర్లు, డియోడరెంట్లు వాడుతూ ఉంటారు. లైంగికంగా కలిసిన ప్రతిసారీ, ‘డూషింగ్‌’ పద్ధతి అనుసరిస్తూ ఉంటారు. కానీ ఇవేవీ సరైన పద్ధతులు కావు. స్నానం చేసేటప్పుడు మిగతా శరీరావయవాల్లాగే యోని ప్రదేశాన్నీ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అలాకాకుండా పదే పదే సబ్బు రుద్ది శుభ్రపరుస్తూ ఉంటే ఆ ప్రదేశంలోని సహజసిద్ధమైన నూనెలు తొలగిపోయి, తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే పరిమళాలు వెదజల్లే డియోడరెంట్లు, సెంట్లు, పౌడర్లు అక్కడ వాడకూడదు. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే యోని ప్రదేశంలో చమట పట్టకుండా చూసుకోవాలి. అలాగే మెత్తని కాటన్‌ లోదుస్తులు ధరించాలి. నైలాన్‌ లోదుస్తులు, బిగుతైన జీన్స్‌ ప్యాంట్లు, లెగ్గింగ్స్‌, షార్ట్స్‌ ధరించకూడదు. తేమను పీల్చుకునే కాటన్‌ ప్యానల్‌ లోదుస్తుల లోపల ఉండాలి. లేదంటే ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తాయు. పెరుగు తినటం వల్ల, దాన్లోని గుడ్‌ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నుంచి మర్మావయాలకు రక్షణ కల్పిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆహారంలో పెరుగు ఉండేలా చూసుకోవాలి.
 
డా షర్మిలా మజుందార్‌,
చీఫ్‌ సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకోఅనలిస్ట్‌,
కన్సల్టేషన్‌ కోసం: Email :mili77@gmail.com