బంధం బలపడాలంటే...

ఆంధ్రజ్యోతి, 16-07-2018: డాక్టర్‌! దాంపత్య జీవితమంటే ‘సెక్స్‌’ ఒక్కటే కాదు కదా? అయినా నాకు తెలిసిన కొన్ని జంటలు విడిపోవడానికి ప్రధాన కారణం... సెక్స్‌! ఇలా ఎందుకు?
- ఓ సోదరుడు, సికింద్రాబాద్‌.
 
ఇది ముమ్మాటికీ నిజం! సెక్స్‌ ఒక్కటే ఇద్దరు వ్యక్తుల్ని కలిపి ఉంచే బంధం కాకపోయినా, దాంపత్య జీవితంలోని ముఖ్యమైన అంశాల్లో సెక్స్‌ ఒకటని చెప్పక తప్పదు. సెక్స్‌ పట్ల దంపతుల్లో విభేదించే అభిప్రాయాలు, ఇష్టానిష్టాలు, దృక్పథాలు వారి మధ్య అనుబంధం బలహీనపడడానికి కారణాలవుతాయి. అలాకాకుండా ఉండాలంటే ఇవిగో ఈ సూత్రాలు పాటించాలి.
సెక్స్‌ విషయంలో దంపతులు క్వాంటిటీకి కాకుండా క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి.
సెక్స్‌ విషయంలో గొడవ పడ్డప్పుడు, ఇద్దరూ ఏ అంశంలో విభేదిస్తున్నారో ఆ విషయాన్ని కాగితం మీద పెట్టాలి. కోపం చల్లారిన తర్వాత చర్చించుకోవాలి.
ప్రతిరోజూ ఒకర్నొకరు కౌగిలించుకోవాలి. కనీసం ముప్ఫై సెకన్లపాటైనా ముద్దు పెట్టుకోవాలి. ఈ చర్యల వల్ల ‘ఆక్సిటోసిన్‌’ అనే హార్మోన్‌ విడుదలై దంపతుల మధ్య అనుబంధాన్ని బలపరుస్తుంది.
వారానికోసారి, భాగస్వామి చేసిన ఏ పని మీ మనసును తాకిందో ఉత్తరంలో రాసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. మన కోసం మన భాగస్వామి చేసిన ఎన్నో చిన్న చిన్న మేళ్లను మరిచిపోతూ ఉంటాం. కానీ ఇలాంటి చిన్న అంశాలనే గుర్తు పెట్టుకుని కృతజ్ఞత తెలుపగలిగితే, ఆ బంధం దృఢమవుతుంది.
సెక్స్‌ విషయంలో ఒకరి కోరికలు, అవసరాలు, ఉద్రేకపరిచే ప్రదేశాలను గుర్తెరిగి మలుచుకోవాలి.
ఒకరి లైంగిక తృప్తికి మరొకరు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా మనసెరిగి నడుచుకోగలిగితే ఆ బంధం కలకాలం నిలబడుతుంది.
 
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌,
email: mili77@gmail.com(కన్సల్టేషన్‌ కోసం)