ఆ అలవాటు మాన్పేదెలా?

26-02-2018 ప్రశ్న:మా వారికి ‘యానల్‌ సెక్స్‌’ అంటే ఆసక్తి. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎంత చెప్పినా వినడం లేదు. ఆయనకి నచ్చజెప్పేదెలా?

మల ద్వారం గుండా అంగం, వేళ్లు, సెక్స్‌ టాయ్స్‌, వైబ్రేటర్లు జొప్పించటాన్నే యానల్‌ సెక్స్‌ అంటారు. లైంగిక క్రీడలో కొత్త కొత్త ప్రయోగాల పట్ల ఆసక్తి కలిగిన పురుషులు యానల్‌ సెక్స్‌ కూడా ప్రయత్నించటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ ప్రయత్నం ఆరోగ్యకరమైనది కాదు. ఇతర లైంగిక క్రీడలకంటే యానల్‌ సెక్స్‌ ద్వారా లైంగిక వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. పైగా మల ద్వారం లోపలి లైనింగ్‌ ఎంతో పలుచగా ఉంటుంది.
 
ఏమాత్రం ఒరిపిడి కలిగినా డ్యామేజ్‌ అవుతుంది. ఇలా డ్యామేజ్‌ అయుతే ఇన్‌ఫెక్షన్లు తేలికగా సోకుతాయి. యానల్‌ సెక్స్‌ ద్వారా క్లమీడియా, జెనైటల్‌ హెర్పిస్‌, జెనైటల్‌ వార్ట్స్‌, గొనేరియా, హెపటైటిస్‌ బి, సిఫిలిస్‌, హెచ్‌ఐవి సంక్రమిస్తాయి. ఇవేకాకుండా యానల్‌ సెక్స్‌ ద్వారా హెపటైటిస్‌ ఎ, లేదా ఇ. కొలై అనే ఇన్‌ఫెక్షన్లు కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. మల ద్వారంలో వేళ్లు జొరపటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి లైంగికపరమైన వ్యాధులు సంక్రమిస్తాయి. యానల్‌ సెక్స్‌లో కండోమ్‌ వాడటం కూడా సురక్షితం కాదు. ఆరోగ్యకరంగా ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా యానల్‌ సెక్స్‌ ఆరోగ్యకరం కాదు. ఈ చర్య ద్వారా స్త్రీల మల ద్వారం లోపలి పొర చిరిగి రక్తస్రావమవుతుంది. మొలలు ఉంటే సమస్య రెట్టింపవుతుంది. మల ద్వారంలో ఉండే సూక్షక్రిముల వల్ల పురుషులకూ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి యానల్‌ సెక్స్‌ దుష్ప్రభావాల గురించి వివరించి మీ వారి మనసు మార్చండి.
 
 
-డా షర్మిలా మజుందార్‌,
చీఫ్‌ సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకోఅనలిస్ట్‌,
Email :mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)