ఎంత సెక్స్‌ ఆరోగ్యకరం?

ప్రశ్న: డాక్టర్‌! మాకు కొత్తగా పెళ్లైంది. అయితే ఎంత తరచుగా సెక్స్‌లో పాల్గొనాలనే విషయంలో మా దంపతులిద్దరికీ ఎన్నో అనుమానాలున్నాయి. తరచుగా పాల్గొనటం ఆరోగ్యకరం అని ఆయన అంటున్నారు. వారంలో రెండు సార్లు పాల్గొన్నా ఫర్వాలేదనేది నా అభిప్రాయం. అసలు సెక్స్‌కు పరిమితులున్నాయా?

వంద మంది కాలేజీ విద్యార్థుల మీద జరిపిన ఓ అధ్యయనంలో, వారంలో ఒకసారి లేదా అసలు సెక్స్‌లో పాల్గొనని వారితో పోలిస్తే, వారంలో రెండుసార్లు సెక్స్‌లో పాల్గొన్న వారిలో ‘ఇమ్యునో గ్లోబ్యులిన్‌ ఎ’ అనే యాంటీబాడీస్‌ 30 శాతం పెరిగినట్టు తేలింది. రోగనిరోధకశక్తి సామర్థ్యంలో ఇమ్యునోగ్లోబ్యులిన్‌ ఎ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తేలికగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వారంలో కనీసం రెండు సార్లైనా సెక్స్‌లో పాల్గొనాలి. అయితే అంతకుమించి పాల్గొన్నంతమాత్రాన ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టమూ ఉండదు.
 
పార్ట్‌నర్‌ ఇష్టపడుతూ ఉన్నప్పుడు సహకరించటంలో తప్పు లేదు. సెక్స్‌ విషయంలో దంపతులిద్దరికీ భిన్నమైన ఇష్టానిష్టాలు ఉన్నప్పుడు కలిసి చర్చించుకుని, ఆనందకరమైన లైంగిక జీవితాన్ని సాగించాలి. లేనిపోని అనుమానాలతో దాంపత్య జీవితానికి పరిధులు విధించుకోవటం అవివేకం. కాబట్టి అర్థం లేని అనుమానాలకు తావివ్వకుండా ఆనందకరమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించండి.
- డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)