లైంగికంగా కలవకపోయినా...

ప్రశ్న: లైంగికంగా కలవకపోయినా హెచ్‌ఐవి వస్తుందని అంటూ ఉంటారు. అలా ఎలా సాధ్యం? హెచ్‌ఐవి సోకే నాన్‌ సెక్సువల్‌ మార్గాలేవి?

 
జవాబు: హెచ్‌ఐవి సోకడానికి లైంగికంగా కలవాల్సిన అవసరం లేదు. వీర్యం, లాలాజలం, జననేంద్రియ స్రావాల ద్వారా హెచ్‌ఐవి ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉన్నా, లైంగికపరమైన అంశాలతో సంబంధం లేని వాటి ద్వారా కూడా హెచ్‌ఐవి సంక్రమించవచ్చు. అవేంటంటే...
 
 ఉమ్మిన లాలాజలం
 రక్త మార్పిడి
 డ్రగ్స్‌ లాంటి మత్తు పదార్థాలు తీసుకునేటప్పుడు నీడిల్స్‌ పంచుకోవటం
 కొరకటం
 కొట్లాటల్లో తగిలే గాయాలు
 హెచ్‌ఐవి ఉన్న వ్యక్తి దాడితో గాయాలపాలవడం
ఈ పరిస్థితుల్లో హెచ్‌ఐవి సంక్రమించటానికి సరిపడా వైరస్‌ ఉంటే, కచ్చితంగా వ్యాధి సంక్రమిస్తుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్టు మీకు అనుమానంగా ఉంటే సాధ్యమైనంత త్వరగా సెక్సాలజిస్ట్‌ లేదా సెక్సువల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ని సంప్రదించండి.
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌, సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌,
email: mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)