ఆనందకరమైన దాంపత్య జీవితం!

02-07-2018: డాక్టర్‌! నేనెంతో మంది దంపతులను చూశాను. వాళ్లంతా తమ తమ దాంపత్య జీవితం గురించి ఎంతోకొంత అసహనం వ్యక్తం చేశారు. నాకిప్పుడు కొత్తగా పెళ్లవుతోంది. వాళ్లలా కాకుండా మా దాంపత్య జీవితం కలకాలం ఆనందంగా సాగాలంటే ఏం చేయాలి?
- ఓ సోదరి, గుంటూరు.
 
 
దాంతప్య జీవితం మధురంగా సాగడానికి కొన్ని చిట్కాలున్నాయి. అవేంటంటే....
మీరు, మీ భాగస్వామి ఒకర్నొకరు అభినందించుకోవడం మర్చిపోవద్దు.
ప్రతి చిన్న విషయానికీ కృతజ్ఞతలు తెలపాలి. రోజంతటిలో మీ భాగస్వామి మీకోసం చేసిన పనులను గుర్తు పెట్టుకుని రాత్రి పడుకునేముందు వాటికి కృతజ్ఞతలు తప్పక చెప్పాలి.
దంపతుల మధ్య నిజాయితీ ఎంతో అవసరం. కాబట్టి ఒకరి పట్ట మరొకరు నిజాయితీతో వ్యవహరించాలి.
మీ రూపం పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి. పెళ్లయి చాలా కాలం అయిపోయింది కదా? అని అందంగా తయారవడం మానుకోకూడదు. అలాగే శరీరాన్నీ ఫిట్‌గా ఉంచుకోవాలి.
మన కోసం భాగస్వామి ఏం చేస్తున్నాడనేది ఆలోచిస్తాం! కానీ తనకోసం మనమేం చేస్తున్నామనేది గ్రహించం. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు సమంగా సాగాలి.
పడకింటి విషయాలు సన్నిహితులతో చర్చించకపోవడమే మంచిది. ఒక్కొకరి సెక్స్‌ లైఫ్‌ ఒక్కోలా ఉంటుంది. ఒకదానితో మరొకటి పోల్చుకోకూడదు. అసంతృప్తికి లోను కాకూడదు.
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
email:mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)