ఒత్తిడితో సెక్స్‌లో తృప్తి లేదా?

05-02-2018: డాక్టర్‌! నాకు ఒత్తిడి ఎక్కువ. ఆఖరుకి లైంగికంగా కలిసే సమయంలో కూడా అదే ఒత్తిడి కొనసాగి, మధ్యలోనే విరమించుకుంటూ ఉంటాను. ఆ సమయంలో హఠాత్తుగా లైంగిక క్రీడ మీద ఆసక్తి సన్నగిల్లి, ఆ పని ఆపేస్తాను. నా ఒత్తిడి తగ్గి, అందరిలా లైంగిక తృప్తి పొందే మార్గం సూచించండి?

ముందు మీ ఒత్తిడికి చికిత్స తీసుకోవాలి. రోజు మొత్తంలో మీరు ఏ ఏ సమయాల్లో, ఏ పనులు చేసేటప్పుడు ఒత్తిడికి గురవుతున్నారో ఒక డైరీలో రాసుకోండి. ఇలా వారం పాటు రాస్తే మీ ఒత్తిడికి కారణం ఏదో తెలిసిపోతుంది. ఇలా యాంగ్జయిటీ డైరీ రాయటం ద్వారా....ఉదయం నిద్ర లేచినప్పుడు, లేదా పడుకోబోయే ముందు, లేదా లైంగిక క్రీడకు ముందు... ఇలా ఏదో ఒక ఒత్తిడి ప్యాటర్న్‌ తెలుస్తుంది. ఆ క్రమాన్నిబట్టి కారణం ఏదో కూడా అర్థమవుతుంది. అలా తెలుసుకున్న ఒత్తిడి కారకాన్ని అదుపు చేసుకుంటే, ఒత్తిడి దానంతటదే అదుపులోకొస్తుంది. ఒక్కసారి ఒత్తిడి చేతిలో ఇరుక్కుంటే మీ జీవనశైలి, దాంతోపాటు మీ లైంగిక జీవితం కూడా దాంతో జత కట్టి, లైంగికాసక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది. కాబట్టి మీ భర్తను సంప్రదించి, లైంగికంగా దగ్గరయ్యే సమయంలో ఒత్తిడిని కలిగించే అంశాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలా గంటపాటు ఒత్తిడికి దూరంగా ఉండగలిగితే, ఒత్తిడి నుంచి తప్పించుకోగలిగే మెలకువలు మీకు అలవడతాయి. వాటిని అనుసరించి ఒత్తిడిని, దాని కారణంగా వస్తున్న అసంతృప్తినీ తేలికగా జయించవచ్చు.
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
చీఫ్‌ సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌.
mili77@gmail.com