అడ్డొస్తున్న నడుము నొప్పి

28-05-2018: నా వయసు 34. మాకు పెళ్లై 13 ఏళ్లు. అయితే గత ఏడేళ్ల నుంచి మా లైంగిక జీవితం కుంటుపడింది. మా వారు ఎక్కువ సమయంపాటు కూర్చుని పని చేస్తారు. దాని వల్ల నడుము నొప్పి వస్తోందనీ, ఆ సమయాన్ని తగ్గించుకుంటే నొప్పి అదుపులోకొస్తుందనీ వైద్యులు సూచించారు. అయినా అది వీలుపడక, మా ఇద్దరి మధ్యా వాగ్వాదాలు జరుగుతున్నాయి. కూర్చుని పని చేసే వాళ్లందరిదీ ఇదే పరిస్థితేనా? మా వారిక ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారా?
ఒక సోదరి, కందుకూరు.
 
నడుము నొప్పి కారణంగా లైంగిక జీవితానికి దూరమవడం అనేది కొంత ఆశ్చర్యంగా అనిపించినా బాధపడుతున్న వాళ్ల దృష్టి నుంచి ఆలోచిస్తే, అది సమంజసమే అనిపిస్తుంది. కాబట్టి వాగ్వాదాలు మాని ఒకర్నొకరు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడి వల్ల తలెత్తే నడుము నొప్పికి వేడి నీటి స్నానం, మర్దన, నొప్పి తగ్గించే క్రీములు వాడడం వలన కొంత ఫలితం ఉంటుంది. కొందర్లో సెక్స్‌లో పాల్గొనడం వల్ల నడుము నొప్పి పెరుగుతుంది కూడా! కాబట్టి ఇద్దరికీ ఎటువంటి శారీరక అసౌకర్యం లేని భంగిమలను ఎంచుకోండి. మీ వారి నడుము మీద ఒత్తిడి పడని భంగిమలైతే ఇద్దరూ సమంగా లైంగిక జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. మరీ ముఖ్యంగా మీరు పైన ఉండి చేసే భంగిమలను అనుసరించడం మంచింది.
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
mili77@gmail.com( కన్సల్టేషన్‌ కోసం)