ఆ సమయంలో నొప్పి సహజమేనా?

ఆంధ్రజ్యోతి(14-11-15):ప్రశ్న:నాకు పెళ్లై 4 నెలలైంది. అయినా సెక్స్‌ అంటే భయం వల్ల ఇప్పటికీ నేను ఆయనను దగ్గరికి రానివ్వలేకపోతున్నాను. మేము శారీరకంగా కలిసే ప్రయత్నం చేసినప్పుడల్లా నాకు విపరీతమైన నొప్పిగా ఉంటుంది. లైంగిక చర్యలో నొప్పి కలగటం ఏదైనా లైంగిక వ్యాధికి సూచనా?

జవాబు: శారీరక సంపర్కం సమయంలో నొప్పి కలగటానికి కారణం యోని పొడిగా ఉండటమే! సాధారణంగా స్త్రీ లైంగికంగా ఉద్రేకం చెందినప్పుడు యోనిలో స్రావాలు స్రవిస్తాయి. వీటి వల్ల యోని లైనింగ్‌ జారుడుగా తయారై లైంగిక చర్య సులభంగా జరిగిపోతుంది. అలాకాకుండా లైంగికంగా ఉద్రేకం చెందకపోవటం లేదా మరేదైనా కారణం వల్ల ఈ స్రావాలు స్రవించనప్పుడు లైంగిక చర్య నొప్పి కలిగించటంతోపాటు యోని లైనింగ్‌ని డ్యామేజ్‌ కూడా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో వెజైనల్‌ లైనింగ్‌ చిరిగిపోయి రక్తస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంది. మీ విషయంలో ఇలా జరగకుండా ఉండాలంటే రెండు మార్గాలను అనుసరించాలి. సహజసిద్ధంగా యోనిలో స్రావాలు స్రవించేలా లైంగికోద్రేకం పొందేవరకూ లైంగిక చర్యలో పాల్గొనకండి. కెవై జెల్లీ లాంటి వాటర్‌బేస్డ్‌ లూబ్రికెంట్‌ని వాడండి. 

 
డాక్టర్‌. షర్మిల మజుందార్‌
కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌
రామయ్య ప్రమీల హాస్పిటల్‌.

mili77@gmail.com