లోపం నాలో ఉందా?

 

 

ఆంధ్రజ్యోతి, 22-01-2019:

డాక్టర్‌! నాకు పెళ్లయి ఆరేళ్లు దాటింది. నా భార్య గర్భం దాలుస్తున్నా మూడవ నెలలో గర్భస్రావం అయిపోతోంది. పరీక్షలు చేయిస్తే ఆమెలో ఏ లోపమూ లేదని తేలింది. నా స్పెర్మ్‌ కౌంట్‌ కూడా బాగానే ఉంది. వరుస గర్భస్రావాలు జరగడానికి కారణం నాలోనే ఉందా? దయచేసి సలహా ఇవ్వగలరు.

 

- ఓ సోదరుడు, ఈతముక్కల
 
సాధారణంగా గర్భం దాల్చకపోయినా, గర్భస్రావం అవుతున్నా, అందుకు మహిళలనే బాధ్యులను చేస్తూ ఉంటారు. కానీ ఇందుకు పురుషులూ బాధ్యులే! పురుషుల్లో వీర్యకణాల ఆకారం మొదలుకుని, నాణ్యత వరకూ ప్రతి అంశం గర్భధారణకు తోడ్పడేదే! వీటిలో లోపాలు గర్భధారణకు అడ్డుపడడంతోపాటు, గర్భం దాల్చినా నిలవకుండా చేస్తాయి. గర్భం దాల్చిన ప్రతిసారీ మూడవ నెల దాటకుండానే గర్భస్రావం అవుతోందంటే అందుకు 50ు కారణం పురుషుల వీర్యకణాల్లో సమస్యలు ఉండడమే! వీర్యకణాల డి.ఎన్‌.ఎలో లోపం ఉన్నా, వాటి నాణ్యత తక్కువగా ఉన్నా, వీర్యంలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, గర్భం నిలవకపోవచ్చు. సాధారణంగా జరిపే వీర్య పరీక్షలో వీర్యకణాల సంఖ్య లెక్కిస్తూ ఉంటారు. కానీ వీటి సంఖ్య సరిపడా ఉన్నా, పైన చెప్పిన సమస్యలు ఉంటే గర్భం నిలవదు. కాబట్టి లోతైన పరీక్షలు చేయించుకుని వీర్యంలో, వీర్యకణాల్లో ఎటువంటి సమస్యలూ లేవని నిర్ధారించుకోండి. ఒకవేళ సమస్యలు ఉంటే సమర్ధమైన చికిత్సలతో సరిదిద్దుకోండి. చికిత్సతో సమస్య పరిష్కారమైతే కచ్చితంగా మీ భార్యకు గర్భం నిలుస్తుంది.
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌.
8332850090
(కన్సల్టేషన్‌ కోసం)