స్వప్న స్ఖలనంతో నీరసం!

04-09-2018: డాక్టర్‌! నా వయసు 20 ఏళ్లు. నాకు హస్తప్రయోగం అలవాటు లేదు. అయినా నిద్రలో స్కలనం జరిగిపోతూ ఉంటుంది. ఇలా వీర్యంగా మారిన నా రక్తం ఎక్కువగా నిద్రలో బయటకు వెళ్లిపోవడం మూలంగా నీరసం ఆవరిస్తోంది. ఈ నష్టాన్ని ఆపేదెలా?

(ఓ సోదరుడు, చిట్యాల)
 
నోట్లో ఉమ్మి తయారయినట్టుగానే వృషణాల్లో వీర్యం ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటుంది. ఇది హస్తప్రయోగం, సెక్స్‌, స్వప్న స్కలనం... ఇలా ఏదో ఒక మార్గంలో బయటకు వెళ్లిపోక తప్పదు. ఇలా వీర్యం నిద్రలో స్కలనమయినంత మాత్రాన మీకు ఒరిగే నష్టమేమీ ఉండదు. రక్తం వీర్యంగా మారుతుంది కాబట్టి వీర్యనష్టం జరిగితే నీరసం వస్తుందనేది కూడా అపోహే! హస్తప్రయోగం అలవాటు ఉన్నవాళ్లకు ఆ పద్ధతి ద్వారా, పెళ్లైనవాళ్లకు లైంగిక చర్య ద్వారా వీర్యం స్కలనం అయిపోతూ ఉంటుంది. మీ విషయంలో ఆ మార్గాలు లేవు కాబట్టి మూత్రం ద్వారా లేదా నిద్రపోతున్నప్పుడు కలిగే స్వప్న స్కలనాల ద్వారా వీర్యం బయటకు వెళ్లిపోతుంది. ఇలా జరగడం అత్యంత సహజం. కాబట్టి భయపడకండి!
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, యాండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌