ఆ సమయంలో నొప్పి ఎందుకు?

04-06-2018: డాక్టర్‌! నా వయసు 35. పెళ్లై ఐదేళ్లు. నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే ఎన్నడూ లేనిది కొన్ని నెలలుగా సెక్స్‌లో పాల్గొంటే యోని ప్రదేశంలో, లోపల నొప్పిగా, అసౌకర్యంగా ఉంటోంది. ఇలా ఎందుకు? మహిళలందరికీ ఈ వయసులో ఇలాంటి ఇబ్బందులు తప్పవా? అసలు ఇంతకు ముందువరకూ లేని నొప్పి ఇప్పుడెందుకు వస్తోంది?

 
ఓ సోదరి, గోరంట్ల
 
లైంగిక క్రీడ తృప్తినివ్వకపోగా అసౌకర్యాన్ని కలిగిస్తోందంటే ఎక్కడో శారీరక సమస్య దాగుందని అర్ధం. లైంగిక క్రీడలో పాల్గొన్న సమయంలో నొప్పి ఉంటోందంటే అందుకు కారణాలు ఇవి.
వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్‌ 
వెజిన్మైసిస్‌
థైరాయిడ్‌ సమస్య 
మెనోపాజ్‌
తగినంత ఫోర్‌ప్లే లేకపోవడం
దంపతుల మధ్య అన్యోన్యత లోపించడం
ఈ సమస్యలను సరిదిద్దుకుంటే మీరూ అందరిలాగే లైంగిక జీవితాన్ని నొప్పి లేకుండా ఆస్వాదించవచ్చు. లోపం ఎక్కుడుందో కచ్చితంగా తెలుసుకోవడం కోసం సెక్సాలజి్‌స్టను సంప్రదించాలి. అలాగే సెక్స్‌కు ముందు తగినంత ఫోర్‌ప్లే తప్పనిసరి. ఈ విషయంలో మీరు మీ భర్తతో మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంతో అవసరం.
 
-డాక్టర్‌ షర్మిలా మజుందార్‌, సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌.