నొప్పి ఎందుకు?

11-02-2019: డాక్టర్‌! నా వయసు 30. ఇటీవలే పెళ్లి అయింది. అయితే గత కొద్ది రోజులుగా లైంగికంగా కలిసిన వెంటనే అంగంలో నొప్పి మొదలవుతోంది. ఆ నొప్పి కొన్ని గంటలపాటు వేధించి తగ్గుతోంది. ఇది ఏదైనా సుఖవ్యాధికి సూచనా? లేక సమస్య అంగంలో ఉందా?
- ఓ సోదరుడు, ఇబ్రహీంపట్నం
 
సెక్స్‌ తర్వాత అంగంలో నొప్పి కలగడం అనేది రెండు కారణాల వల్ల జరుగుతుంది. ‘ఫైమోసిస్‌’ అనే అంగం పూర్వ చర్మం వెనక్కి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు, సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ ఆ ప్రదేశంలో చర్మం రాపిడికి గురై నొప్పి మొదలవుతుంది. ఈ సమస్యను సున్తీతో సరిచేయవచ్చు. అంగంలో నొప్పికి మరో కారణం ప్రోస్టేట్‌ ఇన్‌ఫెక్షన్‌. ఈ గ్రంథిలో సమస్య ఉన్నప్పుడు లైంగిక క్రీడ కష్టం కావచ్చు. సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ నొప్పి అనిపించవచ్చు. ఈ నొప్పి కారణంగా సెక్స్‌కు దూరమయ్యే పరిస్థితీ తలెత్తవచ్చు. ప్రాస్టేట్‌ ఇన్‌ఫెక్షన్‌ను వైద్యపరీక్షల్లో తేలికగానే గుర్తించే వీలుంది. ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించే మందులు వాడితే పరిస్థితి సర్దుకుంటుంది. కాబట్టి వైద్యులను కలిపి తగిన చికిత్స తీసుకోండి. అంతేగానీ అనవసరంగా అర్థం లేని అనుమానాలతో మనసు పాడుచేసుకోవద్దు!
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)