మాకు పెళ్లయి మూడేళ్లు. ఇంతవరకూ మేం శారీరకంగా కలవలేదు.

19-02-2019: డాక్టర్‌! మాకు పెళ్లయి మూడేళ్లు. ఇంతవరకూ మేం శారీరకంగా కలవలేదు. ఆయనకు పినైల్‌ డాప్లర్‌తో సహా అన్ని పరీక్షలూ చేయించాం! ఫలితాలన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. అంగస్తంభనం కోసం పవర్‌ఫుల్‌ వయాగ్రాలూ వాడాం! కానీ ప్రయోజనం లేదు. దాంతో పిల్లల కోసం ఐవిఎ్‌ఫను ఆశ్రయిద్దామనే నిర్ణయానికి వచ్చాం! మా నిర్ణయం సరైనదేనా?

- ఓ సోదరి, ఇల్లందు.
 
 
పరీక్షల ఫలితాలన్నీ నార్మల్‌గానే ఉన్నాయి కాబట్టి ఆయనకు శారీరక సమస్య లేనట్టే! అయితే మిగతా సమయాల్లో అంగస్తంభనలు ఉంటూ, లైంగికంగా కలిసే సమయంలో పటుత్వం కోల్పోతుంటే, మానసిక సమస్యగా భావించాలి. విపరీతమైన భయానికి లోనయినప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. దీన్నే పర్‌ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ అంటారు. అయితే ఈ సమస్యను కూడా అధిగమించే వీలుంది. అంగానికి ‘ఇంట్రా పినైల్‌ ఇంజెక్షన్‌’ ఇచ్చి, మానసిక స్థితితో సంబంధం లేకుండా స్తంభనను నిలిపి ఉంచవచ్చు. ఇచ్చే మందు పరిమాణాన్నిబట్టి అంగస్తంభన కాలాన్ని కూడా పెంచవచ్చు. గంట నుంచి రెండు గంటల వరకూ అంగం స్తంభించే ఉంటుంది. ఇలా ఇంజెక్షన్‌ సహాయంతో రెండు మూడు సార్లు సెక్స్‌లో పాల్గొంటే, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తర్వాత కొద్ది రోజులపాటు నోటి మాత్రలు వాడుతూ, సమస్యను పూర్తిగా తొలగించుకోవచ్చు. ఇంట్రా పినైల్‌ ఇంజెక్షన్‌ గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో కూడుకున్న ఇంజెక్షన్‌ పినైల్‌ డాప్లర్‌ పరీక్ష సమయంలో అంగానికి ఇచ్చినట్టుగానే ఇస్తారు. మైక్రో నీడిల్‌ వాడడం వల్ల నొప్పి స్వల్పంగానే ఉంటుంది. కాబట్టి పిల్లల కోసం ఐ.వి.ఎఫ్‌ పద్ధతులను ఆశ్రయించకుండా సహజసిద్ధంగా సెక్స్‌లో పాల్గొనే ప్రయత్నం చేయండి.
 
డాక్టర్ రాహుల్ రెడ్డి, అండ్రాలజిస్ట్,
ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్ స్టిట్యూట్, హైదరాబాద్
8332850090 (కన్సల్టేషన్ కోసం)