చలికాలంలో సైజు తగ్గడం కామనే

04-02-2019: డాక్టర్‌! నా వయసు 23 ఏళ్లు. నా అంగం హఠాత్తుగా కుంచించుకుపోయింది. స్తంభనాలు మామూలుగానే ఉన్నాయి. స్తంభించినప్పుడు అంగం 5 అంగుళాల పరిమాణం ఉన్నా, మామూలు స్థితిలో చూస్తే, పొడవు తగ్గినట్టు స్పష్టంగా కనిపించడంతో కంగారు మొదలైంది. సెక్సాలజిస్టుని కలిస్తే, అంగం లోపలి కణజాలం పాడైపోయిందని, నెలకు 17 వేల రూపాయల మందులు సూచించారు. నాకంత ఆర్థిక స్థోమత లేదు. నన్ను ఏం చేయమంటారు?
- ఓ సోదరుడు, వరంగల్‌.
 
అంగస్తంభనాలు, స్తంభించినప్పుడు అంగ పరిమాణం ఇంతకుముందులాగే ఉంటే మీకు సమస్య లేనట్టే! లేని సమస్యకు అంత ఖరీదైన మందులు వాడనవసరం లేదు. మీ అంగం కుంచించుకుపోయింది అంటున్నారు. నిజానికి చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల అంగం కొంత కుంచించుకుపోయినట్టు కనిపించడం సహజం. చల్లని వాతావరణానికి అంగంలోని స్పాంజ్‌ లాంటి కణజాలం కుంచించుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది సహజం. అయితే ఈ తేడాను మీరు కొత్తగా గమనించి కంగారుకు లోనయి ఉంటారు. కాబట్టి భయాన్ని వదిలేయండి. వైద్యులు సూచించిన మందులు కూడా వాడవలసిన అవసరం లేదు. లైంగిక కోరిక కలిగినప్పుడు అంగం స్తంభిస్తున్నా, స్తంభించిన పురుషాంగం కనీసం మూడున్నర అంగుళాల మేర పెరుగుతున్నా కంగారు పడవలసిన పని లేదు. అంగంతోపాటు, వృషణాలు కూడా చల్లని వాతావరణానికి కుంచించుకుపోవడం అత్యంత సహజం. కాబట్టి ఈ మార్పులకు భయపడకూడదు. 
 
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌.
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)