ఆయనకు ఇదేం సరదా?

23-07-2018: డాక్టర్‌! నేను 24 ఏళ్ల గృహిణిని. పెళ్లయి సంవత్సరం గడిచింది. అయితే మా దాంపత్య జీవితం నాకు ఆనందాన్ని మిగల్చకపోగా, అంతులేని ఆవేదనను కలిగిస్తోంది. ఇందుకు కారణం మావారి ప్రవర్తనే! ఆయనకు ముఖ రతి ఇష్టం. పురుషాంగాన్ని నోట్లో పెట్టుకోమని బలవంతం చేస్తూ ఉంటారు. కానీ నాకేమో అలా చేయడం ఇష్టం లేదు. దాంతో ఆయన నన్ను ఇష్టమొచ్చినట్టు కొడుతున్నారు. ఈ విషయంలో ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. తగిన సలహా ఇవ్వగలరు!
- ఓ సోదరి, హైదరాబాద్‌.
 
 
లైంగిక ఆనందం పొందాలంటే రెండు వైపులా సుముఖత ఉండాలి. ఒకర్నొకరు ప్రేరేపించుకుంటూ ఆనందం పొందగలిగినప్పుడే దాంపత్య జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. అయితే సెక్స్‌లో ఒకరి వల్ల మరొకరికి అసౌకర్యం కలుగుతూ ఉన్నా, దాన్లో హింసకు తావు ఉన్నా బలవంతంగా ఓర్చుకోవలసిన అవసరం లేదు. మీ విషయంలో అదే జరుగుతోంది. మీరు ఆలస్యం చేయకుండా మీవారిని సెక్సాలజి్‌స్టకి చూపించి మారిటల్‌ కౌన్సిలింగ్‌ ఇప్పించండి. దాని వల్ల పడకింట్లో ప్రవర్తన వల్ల మీరెంత బాధ పడుతున్నారో వైద్యులు వివరిస్తారు. ఒకవేళ ఆయన ఆనందం కోసం కొంత పరిధి మేరకు మీరు ఓరల్‌ సెక్స్‌ చేయడానికి ఒప్పుకున్నా, వారంలో ఎన్నిసార్లు అనేది ఆయనతో స్పష్టం చేయండి. దానికి మీరు అలవాటు పడేవరకూ, మీకు మీరు సౌకర్యంగా భావించేటంతవరకూ ఆయన హద్దులో ఉండేలా కౌన్సిలింగ్‌ ఇవ్వవచ్చు. ఏదైమైనప్పటికీ, మీరిద్దరూ వైద్యుల్ని సంప్రదించడం ఎంతో అవసరం!
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకోఅనలిస్ట్‌,
email:mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)