నాలో లోపమేదైనా ఉందా?

03-12-2018, ప్రశ్న: డాక్టర్‌! నాకు ఇటీవలే పెళ్లయింది. అయితే పెళ్లికి ముందు ‘ఆర్గాజం’ గురించి, దాని ద్వారా పొందే ఆనందం గురించి స్నేహితుల ద్వారా విన్నాను. కానీ ఆయనతో కలిసినప్పుడు నాకు అలాంటి తృప్తి కలగడం లేదు. ఇది నాలో లోపం అనుకోవాలా?
- ఓ సోదరి, శ్రీశైలం.
70 శాతం మహిళలు క్లిటోరిస్‌కు నేరుగా ప్రేరణ అందకుండా ఆర్గాజం పొందలేరు. లైంగిక క్రీడలో క్లిటోరిస్‌కు తగినంత ప్రేరణ అందడం ఆర్గాజం పొందడానికి ఎంతో అవసరం. ఒకవేళ అలా జరిగినా ఆర్గాజం పొందకపోయినా కంగారు పడవలసిన అవసరం లేదు. 10 శాతం మంది మహిళలు ఈ కోవలోకి వస్తారు. అయితే ఆర్గాజం స్వయంగా పొందే అవకాశాలను ప్రయత్నించండి. అయితే సత్వర ఫలితం మాత్రం ఆశించకూడదు.
 
సాధారణంగా ప్రారంభంలో ఆర్గాజం పొందే దశకు చేరుకోవడానికి కనీసం గంట వ్యవధి అవసరమవుతుంది. పదే పదే ప్రయత్నాలు చేయడం ద్వారా ఆర్గాజం పొందే మెలకువలు అలవరుచుకోవచ్చు. ఆర్గాజం పొందడం అనేది ఎవరికి వారు నేర్చుకోవలసిన అంశం. భాగస్వామి ప్రేరేపణలకు స్పందించడంతోపాటు, మనసును లైంగిక క్రీడ మీద లగ్నం చేస్తే ఆర్గాజం పొందడం తేలికవుతుంది. కాబట్టి అనవసర భయాలు, అనుమానాలు వీడండి. అవసరం అనుకుంటే సెక్సాలజిస్టు సలహా తీసుకోండి.

-డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,

సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)