ఈ పరీక్షకు ప్రత్యామ్నాయం లేదా?

02-04-2019: డాక్టర్‌! మాకు పెళ్లయి ఇప్పటికి మూడేళ్లు. పిల్లలు కలగకపోతే వైద్యులను సంప్రతించాం. వారు వీర్య పరీక్ష చేయించమన్నారు. కానీ వైద్యులు సూచించే పద్ధతి ద్వారా వీర్యం సేకరించలేకపోతున్నాను. వీర్య పరీక్షకు వేరే ప్రత్యామ్నాయం లేదా?

- ఓ సోదరుడు, ఖమ్మం

మీలాగా హస్తప్రయోగం అలవాటు పురుషులందరికీ ఉండకపోవచ్చు. వీర్యం సేకరించడం కోసం అనుసరించే పద్ధతి అదే కాబట్టి మీలాంటి పురుషులకు అది ఇబ్బందికరమే! మీలాంటి వారు ‘వైబ్రేటర్‌’ సహాయంతో స్ఖలనం పొంది, వీర్యాన్ని సేకరించవచ్చు. ఇది సురక్షితమైన ప్రత్యామ్నాయం. ఈ పరికరం అన్ని ఆండ్రాలజీ క్లినిక్స్‌లో ఉంటుంది. ఉపయోగించడమూ తేలికే! కాబట్టి వైబ్రేటర్‌ సౌకర్యం ఉన్న క్లినిక్స్‌ను సంప్రతించి, వీర్యాన్ని సేకరించవచ్చు.

ఈ పరికరం మీలాంటి వారితోపాటు పక్షవాతంతో నడుము కింది భాగం చచ్చుబడిపోయిన వారికీ ఉపయోగకరమే! ఇలాంటివారు పిల్లలు కావాలనుకున్నప్పుడు వైబ్రేటర్‌ సహాయంతో వీర్యం సేకరించి, ఐ.వి.ఎఫ్‌ పద్ధతి ద్వారా పిల్లల్ని కనవచ్చు. అలాగే ప్రమాదాల్లో గాయపడి ఏడాది అంతకుమించి మంచానికే పరిమితమైన వారు, ఆలోగా పిల్లల్ని కనాలనుకున్నా ఇదే పరికరం సహాయంతో వీర్యం సేకరించి, కృత్రిమ గర్భధారణతో పిల్లలను కనవచ్చు. వైబ్రేటర్‌ వాడకం వల్ల అంగానికి ఎటువంటి హానీ కలగదు.
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)