మద్యం కారణమా?

29-10-2018: డాక్టర్‌! నా వయసు 30. ఇంతకుముందు ఎప్పుడూ అనుభవంలోకి రాని కొత్త సమస్య తలెత్తింది. గత రెండు నెలలుగా శీఘ్రస్ఖలన సమస్య మొదలైంది. నాకు మద్యం అలవాటు ఉంది. దానికీ ఈ సమస్యకూ ఏదైనా సంబంధం ఉందా?
- ఓ సోదరుడు, అనంతపూరు
 
శీఘ్ర స్ఖలనం సమస్యలో రెండు రకాలుంటాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల తలెత్తే సమస్య....‘ప్రైమరీ ప్రి మెచ్యూర్‌ ఇజాక్యులేషన్‌’. ప్రోస్టేట్‌ గ్రంథి ఇన్‌ఫెక్షన్‌ వల్ల, అతిగా మద్యం సేవించడం వల్ల తలెత్తే... ‘సెకండరీ ప్రి మెచ్యూర్‌ ఇజాక్యులేషన్‌’. మీది రెండో సమస్య అని నిర్ధారణకు వచ్చే ముందు ప్రోస్టేట్‌ గ్రంథి తాలూకు సమస్యలేవీ లేవని తేల్చుకోవాలి. ఆ పరీక్షల్లో ఎటువంటి సమస్యా లేకపోతే, మీది కచ్చితంగా సెకండరీ ప్రి మెచ్యూర్‌ ఇజాక్యులేషన్‌ అయి ఉండవచ్చు. ఈ సమస్యకు కారణాన్ని సరిదిద్దితే సమస్య సమసిపోతుంది. కాబట్టి సమస్యకు కారణమైన మద్యానికి దూరంగా ఉంటూ పౌష్టికాహారం తీసుకుంటూ, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. క్రమేపీ ఇబ్బంది తొలగిపోతుంది. అప్పటికీ పరిష్కారం కాకపోతే సెక్సాలజిస్టును సంప్రతించండి. ప్రోస్టేట్‌ గ్రంథి సమస్యలు ఉన్నా సెకండరీ ప్రి మెచ్యూర్‌ ఇజాక్యులేషన్‌ సమస్య తలెత్తవచ్చు.
 
 
 
-డాక్టర్‌ షర్మిలా మజుందార్‌
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
email: mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)