మొదటి రాత్రి అలా జరగాల్సిందేనా?

04-09-2018:డాక్టర్‌! నా వయసు 20. మొదటి రాత్రి సెక్స్‌లో పాల్గొనే సమయంలో నా భార్యకు రక్తస్రావం జరగలేదు. దాంతో ఆమెకు పూర్వానుభవం ఉందని నాకు అనుమానంగా ఉంది. ప్రతి అమ్మాయికీ తొలి కలయికలో రక్తస్రావం కనిపించాలనీ లేదంటే ఆమెకు అంతకుముందు అనుభవం ఉందని భావించాలనీ స్నేహితులు అంటున్నారు. ఇది నిజమేనా?

ఓ సోదరుడు, ఖమ్మం.
 
ఇలా ప్రతి అమ్మాయికీ జరగాలని లేదు. కొందరికి రక్తం కనిపించవచ్చు. మరికొందరికి కనిపించకపోవచ్చు. అంతమాత్రాన ఆమెను కన్య అనుకోకుండా ఉండనవసరం లేదు. తొలి కలయికలో రక్తం కనిపించడానికి కారణం, ఆమె కన్నెపొర చిరగడమే! ఈ పొర కొందరిలో మందంగా ఉండి తొలి కలయికతోనే చిరుగుతుంది. ఎక్కువశాతం మందిలో ఈ పొర పలుచగా ఉండి బాల్యంలో ఆటలాడే సమయంలోనే చిరిగిపోతుంది. ఎత్తు నుంచి దూకినా, గుర్రపు స్వారీ చేసినా.... ఇలా శారీరక శ్రమ ఎక్కువగా ఉండే ఎలాంటి ఆటలాడే సమయంలోనైనా కన్నెపొర చిరిగిపోవచ్చు. ఇలాంటి అమ్మాయిలకు తొలి కలయిక సమయంలో రక్తం కనిపించదు. కాబట్టి మీ భార్యకి కూడా ఇలాగే జరిగి ఉండవచ్చు. రక్తస్రావం గురించి మీ స్నేహితులు చెప్పిన మాటలు విని మీ భార్యను అనుమానించి బాధ పెట్టకండి. మనసు నుంచి అనుమానాలను వెళ్లగొట్టి, దాంపత్య జీవితాన్ని ఆనందించండి!
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)