ఆయనకు ఇబ్బంది కలుగుతుందా?

26-02-2019: డాక్టర్‌! నేను గర్భనిరోధక సాధనం (ఇంట్రా యుటెరిన్‌ డివైజ్‌) వేయించుకుందామని అనుకుంటున్నాను. దాని కారణంగా సెక్స్‌లో పాల్గొనే సమయంలో
ఆయనకు ఇబ్బంది కలుగుతుందా?
 

యోని నుంచి గర్భాశయ ముఖద్వారం చేరుకోగలిగితేనే ఈ సాధనం తాలూకు వైర్లు తగులుతాయి. ఐ.యు.డికి సంబంధించిన వైర్లు గర్భాశయ ముఖద్వారం వెనక ఉండిపోతాయి. కాబట్టి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అంగానికి ఇవి తగిలే అవకాశమే ఉండదు. అయితే ఈ డివైజ్‌ ఏర్పాటు చేసిన తర్వాత, సెక్స్‌లో పాల్గొన్న సమయంలో అంగానికి ఏదో గుచ్చుకున్నట్టు అనిపించిందని తమ భర్తలు చెప్పినట్టు, కొందరు మహిళలు వైద్యులతో చెప్పిన సందర్భాలూ లేకపోలేదు. అయితే ఆ వైర్లు మెత్తబడే వీలు లేకుండా గట్టిగానే ఉండిపోతే అలా జరిగే వీలుంది. కొన్ని సందర్భాల్లో ఈ వైర్లు మరీ పొట్టిగా ఉండి గర్భాశయ ముఖద్వారంలోనే ఉండిపోయినా ఇలాగే అనిపించే వీలుంది. అయితే ఇలా జరగడం ఎంతో అరుదు. ఇంకా అనుమానంగా ఉంటే వైద్యులను కలిసి మాట్లాడి, నిర్ణయం తీసుకోండి.

డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకోఅనలిస్ట్‌
mili77@gmail.com(కన్సల్టేషన్‌ కోసం)