ప్రసవం తర్వాత ఆసక్తి తగ్గుతుందా

26-11-2018, ప్రశ్న:డాక్టర్‌! నేను గర్భవతిని. మరో రెండు నెలల్లో ప్రసవం జరగవచ్చు. అయితే ప్రసవం తర్వాత యోని వదులుగా తయారవుతుందనీ, దాంతో భర్తకు ఆసక్తి తగ్గుతుందని నా స్నేహితురాలు అంటోంది. ఇది ఎంతవరకూ నిజం?

- ఓ సోదరి, విశాఖపట్నం
 
ప్రసవ సమయంలో బిడ్డను బలంగా బయటకు నెట్టడం వల్ల యోని కొంత వదులయ్యే మాట నిజమే! అయితే ప్రసవం ముందుతో పోలిస్తే తర్వాత, యోని 1 నుంచి 4 సెంటీమీటర్ల మేరకు మాత్రమే వెడల్పు అవుతుంది. ప్రసవం తర్వాత తిరిగి సాధారణ సైజుకు చేరుకోవడం అనేది బిడ్డ సైజు, ప్రసవానికి పట్టిన సమయం, యోని చిరుగుకు వైద్యురాలు వేసిన కుట్లు, ప్రసవం తర్వాత చేసిన కెగెల్‌ వ్యాయామాలు... ఇలా ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రసవం తర్వాత కెగెల్‌ వ్యాయామాలు చేస్తే యోని తిరిగి యథాతథ స్థితికి చేరుకోవచ్చు. ఒకవేళ యోని అనుకున్నంత బిగుతుగా మారకపోతే సెక్సాలజిస్టును కలిసి సలహా అడగవచ్చు. వైద్యులు ‘వెజైనోప్లాస్టీ’ సర్జరీ సూచిస్తే గైనకాలజిస్టును కలిసి జారిపోయిన యోని బయటి, లోపలి కండరాలను పైకి లాగి, బిగుతుగా కుట్టే సర్జరీ చేయించుకోవచ్చు.
 
 
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)