ఈ సమస్యను ఎలా సరిదిద్దాలి?

ప్రశ్న: డాక్టర్‌! నా స్నేహితుడికి ఈ మధ్యే పెళ్లైంది. అయితే అతనికి శీఘ్ర స్ఖలన సమస్య ఉందనీ, వైద్యులను కలిసి చికిత్స తీసుకోమనీ అతని భార్య బలవంతపెడుతోంది. అసలు ఎంత సమయంలోగా స్ఖలనమైతే శీఘ్రస్ఖలనంగా భావించాలి? వివరంగా చెప్పగలరు?

- ఓ సోదరుడు, ఘటకేసర్‌.
 
జవాబు: సాధారణంగా లైంగిక క్రీడలో ఐదు నుంచి ఐదున్నర నిమిషాల నిడివి తర్వాత స్ఖలనం జరగాలి. ఇది కనీస సమయం. అలా కాకుండా అంగప్రవేశం జరిగిన నిమిషంలోగానే స్ఖలనం జరిగిపోతే దాన్ని శీఘ్రస్ఖలనంగా భావించాలి. స్ఖలన సమయం దంపతులిద్దరినీ అసంతృప్తికి లోను చేస్తుంటే దాన్ని సమస్యగానే భావించాలి. ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌లో కూడా రెండు రకాలుంటాయి.
 
1. ప్రైమరీ ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌. దీన్లో లైంగికంగా కలిసిన ప్రతిసారీ సమస్య కనిపిస్తూ ఉంటుంది.
 
2. సెకండరీ ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌. దీన్లో అంతకుముందు వరకూ లేకుండా కొత్తగా శీఘ్రస్ఖలన సమస్య తలెత్తుతుంది. ప్రైమరీ ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌ సమస్యకు కారణాలు మానసికమైనవై ఉంటాయి. సెకండరీ ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌కు మానసికమైనవీ, శారీరకమైనవీ రెండు కారణాలు ఉంటాయి. అతిగా మద్యం సేవించడం, ప్రోస్టయిటిస్‌ అనేవి ప్రధానమైన శారీరక సమస్యలు. ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌ సమస్య శారీరకమైనదైతే, ఆ కారణాన్ని సరిదిద్దితే సమస్య చక్కబడుతుంది.
 
ఈ చికిత్స సులభం. కానీ మానసికమైన కారణాల వల్ల తలెత్తిన ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌ను సరిదిద్దడం కొంత క్లిష్టం. ఇందుకు అనుభవజ్ఞులైన సెక్సాలజిస్టుల చేత కౌన్సెలింగ్‌ ఇప్పించవలసి ఉంటుంది. కాబట్టి మీ స్నేహితుడికి ఉన్నది ఎలాంటి సమస్య అనేది కనిపెట్టడం ఎంతో కీలకం. అతణ్ణి వైద్యుల దగ్గరకి తీసుకువెళ్లి చికిత్స ఇప్పించండి.
 
 
-డాక్టర్‌ షర్మిలా మజుందార్‌
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
email: mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)