ఆ మాత్రలు వాడొచ్చా?

10-09-2018: డాక్టర్‌! నా వయసు 60. కోరిక పెరగడం కోసం వయాగ్రా వాడదామని అనుకుంటున్నాను. ఆ మాత్రల వల్ల గుండె మీద దుష్ప్రభావం పడుతుందని విన్నాను. ఇది నిజమేనా? ఈ వయసులో వాడడం ఎంతవరకూ శ్రేయస్కరం?
- ఓ సోదరుడు, విశాఖపట్నం.
 
రక్తనాళాలు చిక్కుబడి, బలహీనమై అంగం తగినంత గట్టిపడని వాళ్లు, గట్టి పడినా ఎక్కువ సమయంపాటు నిలిపి ఉంచలేని వాళ్ల కోసం తయారు చేసిన మాత్ర వయాగ్రా. అయితే ఈ మందు స్తంభనను ఎక్కువ సమయంపాటు నిలిపి ఉంచగలదు కూడా! కాబట్టి ఎక్కువ సమయంపాటు లైంగికానందం పొందాలనుకునే వాళ్లు అరుదుగా ఈ మాత్రను తీసుకోవచ్చు. వీటిని ఏ వయసు వారైనా వాడవచ్చు. ఈ మాత్ర వల్ల లైంగిక కోరిక కచ్చితంగా పెరుగుతుంది. గుండె మీద దుష్ప్రభావం పడుతుందనేది అవాస్తవం.
 
అయితే గుండె సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం వైద్యులను సంప్రతించి, వారు అనుమతించిన తర్వాతే వయాగ్రా వాడాలి. అలాగే ఈ మాత్రలను అదే పనిగా వాడడం కూడా శ్రేయస్కరం కాదు. మీ విషయానికొస్తే 10 లేదా 15 రోజులకోసారి లైంగిక క్రీడలో పాల్గొనే పనైతే, కార్యానికి గంట ముందు ఆ మాత్ర వేసుకోవచ్చు. కానీ ప్రతి రోజూ వయాగ్రా వాడడం ఆరోగ్యానికి క్షేమం కాదు. వీటిని ప్రతి రోజూ వాడడం వల్ల వాటికి వ్యసనపరులుగా మారే ప్రమాదం ఉంది. మాత్ర వేసుకున్నప్పుడు కనిపించిన సామర్ధ్యం వేసుకోనప్పుడు లోపించి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి మరీ ముఖ్యంగా యుక్తవయస్కులు వీటిని వాడకుండా ఉండడమే మేలు..
 
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, యాండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌