మూలికా వైద్యాన్ని నమ్మవచ్చా?

ఆంధ్రజ్యోతి, 02-10-2018: డాక్టర్‌! నా వయసు 35. నాకు స్తంభన సమస్య ఉంది. ఇటీవలి కాలంలో టీవీ, పేపర్లలో లైంగిక సమస్యలకు మూలికా వైద్యం గురించిన ప్రకటనలు తరచుగా కనిపిస్తున్నాయి. ఈ వైద్యాన్ని నమ్మవచ్చా? నా సమస్యకు మూలికా వైద్యం ఎంతవరకూ ఉపయోగపడుతుంది?

(ఓ సోదరుడు, నంద్యాల)
 
హార్మోన్‌ లోపం, రక్తనాళాల్లో అడ్డంకులు, రక్తప్రవాహంలో హెచ్చుతగ్గులు.... ఇలా స్తంభన సమస్యలకు ఎన్నో కారణాలుంటాయి. మూలికా వైద్యం కేవలం హార్మోన్‌ లోపాన్ని మాత్రమే సరిదిద్దగలదు. ఈ సమస్య ఉన్నవాళ్లకు మూలికా వైద్యం వల్ల ఫలితం దక్కినంత మాత్రాన ఇతర సమస్యల వల్ల స్తంభన సమస్యలు ఉన్నవారు ఇదే వైద్యంపై ఆధారపడకూడదు. స్తంభన సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకోకుండా మూలికా వైద్యం మీద ఆధారపడడం సరైన పని కాదు. కాబట్టి మీ సమస్యకు హర్మోన్‌ లోపం, అంగంలోని రక్తనాళాల్లో, రక్తప్రవాహంలో అడ్డంకులు.. వీటిలో అసలు కారణాన్ని కనిపెట్టాలి. ఇందుకోసం అనుభవజ్ఞులైన ఆండ్రాలజిస్టుని సంప్రతించి తగిన చికిత్స తీసుకోవాలి. అంతేగానీ ఎవరికో ఫలితం ఇచ్చింది కదా అని మీరూ ఈ మందులను నమ్ముకోకూడదు. ఇలా ఆలస్యం చేస్తూ పోతే స్తంభన సమస్య సరికాకపోగా, చికిత్సకు లొంగనంతగా ముదిరిపోనూవచ్చు. కాబట్టి మూలికా వైద్యం మీద పూర్తి భారం వేయకుండా వైద్యుల్ని కలిసి సమర్థమైన చికిత్స తీసుకోండి.
 
 
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.