శృంగారానికి బెడ్రూం రంగూ కీలకమేనట!

01-07-2018: ఇంటికి వేసిన రంగులు వేయించడం ఒక కళ అంటారు. అయితే అది కళే కాదు. మనిషి ప్రవర్తనలో కూడా ఆ రంగుల పాత్ర ఉందంటుందని ఓ సర్వే తేల్చి చెప్పింది. ముఖ్యంగా శృంగార పరమైన భావనల విషయంలో ఈ రంగులు మరింత ప్రభావాన్ని చూపుతాయని ఆ సర్వేలో పేర్కొన్నారు. బెడ్రూంలోని గోడల రంగు భాగస్వాముల వైవాహిక జీవితాన్ని మరింత సుఖవంతం చేస్తాయని పేర్కొన్నారు. కాగా ఏ రంగు ఏ విధమైన ప్రభావాన్ని కలిస్తుందనే విషయాన్ని సైతం వెల్లడించారు.

 
నీలం రంగు
చాలా ఎక్కువ మంది గులాబీ, ఎరుపు రంగులను సాన్నిహిత్యానికి ఉపయోగపడతాయని భావిస్తారు. అయితే ఇవి అభిరుచిని ప్రేరేపించే రంగులు కాదని, వాటికంటే నీలం రంగు ప్రభావం ఎక్కువగా ఉంటుందని సర్వే తెలిపింది. సర్వేలో ఎక్కువ మంది ప్రజలు నీలం రంగునే ప్రశాంతమైనదిగా భావించారట. నీలం రంగు ఉన్న గదిలో వారు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు చెప్పారని సర్వే తెలిపింది. నీలం రంగు గది కలిగిన కుటుంబాల్లో వారానికి సగటున మూడు, నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
 
పసుపు రంగు
నీలం రంగు తర్వాత అత్యంత ప్రభావితమైన రంగు పసుపు రంగు. పసుపు రంగును ఎక్కువగా ఆకలిని ప్రేరేపిస్తుందని అంటుంటారు. అయితే పడక గదిలో సైతం ఈ రంగు మరింత ప్రేరేపితంగా ఉంటుందని సర్వేలో తేలింది. ఇలాంటి గదుల్లో నివసించే ప్రజలు సగటున 7 గంటల 40 నిమిషాలు నిద్రపోతున్నట్లు సర్వే పేర్కొంది. పసుపు రంగు మానసిక ప్రశాంతతను ఇస్తుందని, దీని వల్ల శృంగార జీవితం కూడా బాగుంటుందని అన్నారు.
 
గ్రే లేదా సిల్వర్
సిల్వర్ రంగులో ఉన్న బెడ్రూం మూన్‌లైట్ లాంటి వాతావరణనాన్ని, ఓదార్పును అందిస్తుందని ఎక్కువ మంది ప్రజలు తెలిపారు. రాత్రులు వెన్నెలలో పడుకున్న అనుభూతి ఈ రంగు బెడ్రూంలో ఉంటుందని వారు పేర్కొన్నారు. సర్వేలో 21 శాతం మంది ప్రజలు ఈ రంగు బెడ్రూంని ప్రేరేపిత శృంగార గదిగా పేర్కొన్నారు.
 
కాగా మిగతా స్థానాల్లో పర్పుల్, తెలుపు రంగులు ఉన్నాయి. బ్రిటిషర్లలో ఎక్కువ మంది తెలుపు రంగును శృంగానికి అనువైన రంగుగా ఎంచుకున్నారు.