యాంటీబయోటిక్స్‌ నిరోధకత కోసం కొత్త పరీక్ష!

10-8-2017: ఇన్ఫెక్షన్‌ల చికిత్స కోసం ఉపయోగించే యాంటిబయోటిక్స్‌ నిరోధకతకు కారణమయ్యేవాటిని గుర్తించేందుకు కొత్త పరీక్షను కనుగొన్నారు స్వీడన్‌లోని ఉప్సల యూనివర్సిటీ పరిశోధకులు.  ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్‌, బ్లడ్‌ ఇన్ఫెక్షన్‌ల కోసం ఇచ్చే యాంటీబయోటిక్స్‌ నిరోధకతను కనుగొనడంలో ఈ పరీక్ష సమర్థంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. యాంటీ బయోటిక్స్‌ సమక్షంలో కూడా పెరుగుతున్న బాక్టీరియాను ఈ పరీక్ష ద్వారా 10 నుంచి 30 నిమిషాల్లో గుర్తించవచ్చని తెలిపారు.